For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో 24X7 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్

|

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఈ పేమెంట్ బ్యాంక్ నుంచి ఇక నుంచి 24X7 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ జరుపుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లు NEFT వినియోగించుకునేలా ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసింది.

శుభవార్త: హైదరాబాద్ - బెంగళూరు ఆర్టీసీలో ఛార్జీలు తగ్గాయిశుభవార్త: హైదరాబాద్ - బెంగళూరు ఆర్టీసీలో ఛార్జీలు తగ్గాయి

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు వినియోగదారుల ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని బ్యాంకింగ్ విభాగం నుంచి లేదా వెబ్ సైట్ నుంచి దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ.. కస్టమర్లకు సరళమైన బ్యాంకింగ్ విధానం అందించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను స్వాగతిస్తున్నామని, నెఫ్ట్ ద్వారా తమ కస్టమర్లు ఏ బ్యాంకు అకౌంట్‌కు అయినా బదలీ చేసుకోవచ్చుని చెప్పారు.

Airtel Payments Bank enables NEFT, users can make transfers at any time

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకును 2017 జనవరిలో ప్రారంభించారు. 29 రాష్ట్రాల్లో 5,00,000 బ్యాంకింగ్ పాయింట్లతో ప్రారంభమైంది. 60,000 పాయింట్లు బీమా, పెన్షన్ వంటివాటిపై దృష్టి సారించాయి. ఇండియాలో ఇది తొలి పేమెంట్ బ్యాంకు. 40 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు.

English summary

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో 24X7 నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ | Airtel Payments Bank enables NEFT, users can make transfers at any time

Airtel on Thursday said that its Payments Bank customers can now use the National Electronic Funds Transfer (NEFT) facility at any time of the day, under the new guidelines released by the Reserve Bank of India.
Story first published: Friday, December 27, 2019, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X