For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.3,000 కోట్లు రీఫండ్ చేయలేని పరిస్థితులు, అదొక్కటే మార్గం

|

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో విమానాలు తిరగలేదు. ఆ సమయంలో టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకి క్యాష్ రీఫండ్ చేయాల్సి ఉంది. అయితే నగదు కొరత కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్లను అప్పుడే రీఫండ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించి క్రెడిట్ షెల్స్ కలిగి ఉన్నవారు ఎక్కువకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

రూ.20వేల డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్రూ.20వేల డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్

రీఫండ్స్ సాధ్యం కాకపోవచ్చు

రీఫండ్స్ సాధ్యం కాకపోవచ్చు

ప్రయాణికులకు రూ.3,000 కోట్లు విమానయాన సంస్థలు రీఫండ్ చేయాల్సి ఉంది. టిక్కెట్ క్యాన్సిల్ చేయడం ద్వారా ఆ మొత్తంతో భవిష్యత్తు తేదీలతో ప్రయాణికులు ట్రావెల్ చేయవచ్చు. ప్రయాణికులకు దాదాపు రూ.1,500 కోట్ల వరకు రీఫండ్ చేసినట్లుగా డేటా చూపిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం, ఎయిర్‌లైన్స్ సంస్థల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో రీఫండ్స్ పెరిగాయి. విమానరంగం ఆర్థికంగా దారుణంగా చితికిపోయిందని, దీంతో ప్రయాణీకుల రీఫండ్ మొత్తం సాధ్యం కాదని చెబుతున్నారట. అయితే ఈ డబ్బును క్రెడిట్ షేల్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితి

ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితి

విమాన సంస్థల వద్ద నిధులు లేకపోవడంతో డబ్బులు రీఫండ్ చేయాలని ప్రభుత్వం కూడా ఫోర్స్ చేయలేని పరిస్థితులు. ఎయిర్ లైన్స్ దారుణ నష్టాల్లో, అప్పుల్లో ఉన్నాయని చెబుతున్నారు. విమానయాన సంస్థలు, ప్రయాణికులకు నష్టం జరగకుండా పరిష్కార మార్గం ఆలోచించాలని చెబుతున్నారు.

రీఫండ్స్ నిబంధనలు

రీఫండ్స్ నిబంధనలు

ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించిన అన్ని రీఫండ్ నిబంధనలు పాటిస్తున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. పరిశ్రమ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఇండిగో చెబుతోంది. డబ్బులు తిరిగి చెల్లించడం సులభం కాదని, కొన్ని విమాన సంస్థలు నగదు లభ్యతతో సౌకర్యవంతంగా ఉండవచ్చునని, అంతమాత్రాన డబ్బులు ఉందని కాదని, కొన్ని సంస్థలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ఖర్చులు, నష్టాలను తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ షేల్స్ ఈజీ అంటున్నారు. క్రెడిట్ షెల్స్ వినియోగం కోసం ప్రయాణికులకు నిర్దిష్ట గడువు ఉంది. దీనిని విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఉండాలంటున్నారు.

English summary

రూ.3,000 కోట్లు రీఫండ్ చేయలేని పరిస్థితులు, అదొక్కటే మార్గం | Airlines unlikely to refund Rs 3,000 crore to passengers

People who were issued credit shells against tickets cancelled for flights during and after the national lockdown may have to hold on to them longer, as cash-strapped airlines are unlikely to refund about ₹3,000 crore they owe to passengers.
Story first published: Tuesday, August 4, 2020, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X