విమాన యాన సంస్థలకు కరోనావైరస్ సంక్షోభం నుండి బయటపడటం కార్యరూపం దాల్చలేదు . ఒకపక్క కరోనా ఇంకా వ్యాప్తి చెందుతుంటే , మరోపక్క విమానయాన సంస్థలు సుదీర్ఘమైన, శీతాకాలాన్ని ఎదుర్కోనున్నాయి. ఇదివిమానయాన సంస్థలకు తీవ్ర ఆర్ధిక భారాన్ని కలిగిస్తుంది . ఖర్చు తగ్గించే పరిస్థితి లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి .

భారీగా పడిపోయిన ఆదాయాలు .. తగ్గని మెయింటెనెన్స్ ఖర్చులు
విమాన యాన సంస్థలు కాలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి .ఇండస్ట్రీ బాడీ ఐఎటిఎ ప్రకారం, విమానయాన ఆదాయాలు ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 80 శాతం పడిపోయాయి, కాని సిబ్బంది, నిర్వహణ, ఇంధనం, విమానాశ్రయ లెవీలు మరియు ఇప్పుడు విమాన నిల్వ వంటి వాటికి ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి. ఖర్చులకు తగ్గట్టు ఆదాయ మార్గాలు కనిపించటం లేదు .

పుంజుకుంటుందని భావిస్తే సెప్టెంబర్ లో డీలా పడిన విమానయాన సంస్థలు
కరోనావైరస్ ఆంక్షలు సడలించడంతో జూలైలో స్వల్పంగా కోలుకున్న తరువాత విమానయాన సంస్థలు మళ్ళీ పంజుకున్తున్నాయి అంటే ట్రాఫిక్ మళ్లీ సెప్టెంబరులో ఘోరంగా పడిపోయింది. శీతాకాలపు బుకింగ్‌లు అక్టోబర్ 25 నుండి ప్రారంభమవుతాయి . అయితే అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 78 శాతం తగ్గాయి. రాబోయే రోజుల్లో శీతాకాలం విమానయాన సంస్థలకు మరిన్ని కష్టాలకు గురి చేస్తుందని భావిస్తున్నారు.ఇప్పుడు ఎక్కువ లాభదాయకమైన వ్యాపార తరగతి ప్రయాణికులు కరోనా వైరస్ నేపధ్యంలో ప్రయాణాలు చెయ్యటం లేదు. దీంతో బిజినెస్ క్లాస్ వ్యక్తులు లేకపోవడం అతిపెద్ద నిరాశలలో ఒకటి.

ప్రయాణికులకు భరోసా కల్పించటంలో విఫలం .. ఆపై కఠిన ఆంక్షలతో నష్టం
విమాన ప్రయాణం సురక్షితం అని ప్రయాణికులకు భరోసా ఇవ్వడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు చాలా సేఫ్టీ ని చూపించడంలో విఫలమయ్యాయి, అయితే ఎక్కడి వెళ్ళినా తిరిగి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల వరకు నిర్బంధాలతో సహా ప్రభుత్వ ఆంక్షలు దెబ్బతిన్న విమానయాన సంస్థలపై ఒత్తిడి పెంచాయి. విమాన ప్రయాణ సమయంలో కోవిడ్ -19 సంక్రమించే ప్రమాదం నిజంగా చాలా తక్కువ" అని ఐఎటిఎ యొక్క వైద్య సలహాదారు డాక్టర్ డేవిడ్ పావెల్ చెప్పారు.

ఖర్చులు భరించలేక సిబ్బందిని తగ్గిస్తున్న సంస్థలు .. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
ఇక ఖర్చులు భరించలేక ఈ నెల ప్రారంభంలో, యునైటెడ్ ఎయిర్లైన్స్ 13,000 మంది సిబ్బందిని తాత్కాలికంగా తొలగించింది. ఇతర విమానయాన సంస్థలు వ్యాపార నష్టాల నుండి గట్టెక్కటానికి పూర్తిగా కొత్త కోణాలను ఆలోచిస్తున్నాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన దిగ్గజం A380 విమానాలలో ఒకదాన్ని రెస్టారెంట్‌గా తెరిచింది. తమ విమానంలో ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది . ఇక రాబోయే శీతాకాలం అత్యంత గడ్డుకాలంగా భావిస్తున్న విమానయాన సంస్థలు పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రభుత్వాల సహకారం కోసం ఎదురు చూస్తున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications