For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AirAsia: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 50 లక్షల విమాన టిక్కెట్లు.. మిస్ కాకండి..

|

AirAsia Free Tickets: విమానయాన కంపెనీల వ్యాపారం కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఎయిర్‌ఏషియా సంస్థ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా 50 లక్షల మంది ప్రయాణికులకు ఉచితంగా విమనా టిక్కెట్లను అందించనున్నట్లు ప్రకటించింది.

ఆఫర్ గడువు..

ఆఫర్ గడువు..

సరసమైన టిక్కెట్లను అందించడంలో ఎయిర్‌లైన్ పరిశ్రమలో AirAsia ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఉచిత టిక్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది. ఈ ఉచిత టిక్కెట్ ఆఫర్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25న ముగుస్తుందని విమానయాన సంస్థ వెల్లడించింది.

ప్రయాణం వివరాలు..

ప్రయాణం వివరాలు..

ఈ ఆఫర్ చాలా ఆసియా దేశాల ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనిని వినియోగించుకోవాలనుకునే వారు జనవరి 1, 2023 నుంచి అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద అందిస్తున్న 50 లక్షల టిక్కెట్ల ఉచిత సీట్ల విక్రయం ఆఫర్ వెబ్‌సైట్, యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

బ్యాంకాక్ నుంచి..

బ్యాంకాక్ నుంచి..

కంపెనీ నిర్ణయించిన గమ్యస్థానాల్లో బ్యాంకాక్ (సువర్ణభూమి) నుంచి కరాబి, ఫుకెట్‌లకు నేరుగా విమానాలు, అలాగే బ్యాంకాక్ (డాన్ ముయాంగ్) నుంచి ఛాంగ్​ మై, సకోన్‌కు నేరుగా విమానాలు ఉన్నాయి. సకోన్​ నకోర్న్​, నకోర్న్​ శ్రిమ్మరట్​, నాత్రంగ్​, లౌంగ్​ ప్రబంగ్​, మడలయ్​, ఫమ్​, పెనాంగ్​తో పాటు ఇతర గమ్యస్థానాలకు ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త విమానాల ప్రారంభం..

కొత్త విమానాల ప్రారంభం..

AirAsia గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్ మాట్లాడుతూ "అతిపెద్ద ఉచిత సీట్ల ఆఫర్ కోసం మాకు మద్దతునిచ్చిన ప్రయాణీకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకు ఇష్టమైన ఎన్నో గమ్యస్థానాలను రీలాంచ్ చేశాము. దీనితో పాటు కొత్త అధిక విలువ, ఇష్టమైన ఉత్తేజకరమైన గమ్యస్థానాలకు కూడా విమానాలు ప్రారంభించబడతాయి." అని అన్నారు.

English summary

AirAsia: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 50 లక్షల విమాన టిక్కెట్లు.. మిస్ కాకండి.. | AirAsia offering 50 lakh flight tickets for free to its customers know details for booking

AirAsia offering 50 lakh flight tickets for free to its customers know details for booking
Story first published: Tuesday, September 20, 2022, 12:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X