For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Air India: నింగిని శాశించనున్న టాటాలు.. ఇండిగోను వెనక్కు నెట్టేందుకు ప్లాన్ అమలు..

|

Air India: స్వతంత్రం వచ్చిన దశాబ్దాల తర్వాత టాటాలు ప్రారంభించిన ఎయిర్ ఇండియా తిరిగి వారి గూటికి చేరుకుంది. వేల కోట్ల నష్టాలతో ప్రభుత్వ రంగంలో విమానసంస్థను నడపలేమంటూ భారత ప్రభుత్వం చేతులెత్తేసిన సమయంలో మహారాజాను తిరిగి రతన్ టాటా సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనిని మార్కెట్ లీడర్ గా తిరిగి తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు పెడుతున్నాయి.

విస్తారా విలీనం..

విస్తారా విలీనం..

టాటాలు దేశంలో ఎయిర్ ఇండియా, విస్తారా కంపెనీలను కలిపేందుకు ప్రయత్నాలు మెుదలయ్యాయి. ఇందులో భాగంగా విస్తారాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉన్న వాటాలకు బదులుగా వారికి ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా దక్కనుంది. ఈ విలీనంతో కంపెనీకి విమానయానంలో పోటీపడేందుకు మంచి అవకాశం లభించనుంది. దీనికి తోడు ఖర్చులను సైతం తగ్గించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలుస్తోంది.

2024 నాటికి..

2024 నాటికి..

ఈ విలీన ప్రక్రియ పూర్తి కావటానికి మార్చి 2024 వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఈ కాలంలో వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుందని తెలుస్తోంది. దీనికి తోడు టాటాలకు మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఇండియాలోని పూర్తి వాటాలను కొనుగోలు చేసింది. ఇది ఒక లో కాస్ట్ క్యారియర్. బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకునే భారతీయులకు ఇది ఎంతగానో నచ్చే కంపెనీ. ప్రస్తుతం వీటన్నింటినీ ఒకటే గొడుగు కిందకు తీసుకురావటం వల్ల కంపెనీకి మార్కెట్లో పోటీపడేందుకు అవకాశాలు పెరగనున్నాయి.

ఇండిగో ఎయిర్ వేస్..

ఇండిగో ఎయిర్ వేస్..

భారత విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇప్పటికీ ఇండిగో విమానాలను తమ ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. డొమెస్టిక్ మార్కెట్లో కంపెనీకి దాదాపు 57 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. అందుకే కంపెనీ ఈ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉంది. లో కాస్ట్ క్యారియర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇండిగో ప్రస్తుతం టాటాలకు అతిపెద్ద పోటీదారుగా ఉంది. గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న కంపెనీని 2006లో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ స్థాపించారు.

రిక్రూట్ మెంట్..

రిక్రూట్ మెంట్..

టాటాలు తమ విస్తరణ ప్రణాళికకు అనుకూలంగా కొత్త విమానాలను ఆర్డర్ చేయగా ఇటీవల భారీ రిక్రూట్ మెంట్ డ్రైవ్ సైతం నిర్వహించింది. దీనికి తోడు ఇప్పటికే ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లకు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్ రెండవ దశను ప్రవేశపెట్టింది. కంపెనీకి కొత్త నాయకత్వంతో పాటు సేవలను వేగవంతంగా అందిస్తూ ఖర్చులను తగ్గించేందుకు అనేక పని పద్ధతులను సైతం అమలులోకి తెచ్చారు టాటాలు. ఇవి కంపెనీని రానున్న కాలంలో వేగంగా ముందుకు సాగేందుకు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

English summary

Air India: నింగిని శాశించనున్న టాటాలు.. ఇండిగోను వెనక్కు నెట్టేందుకు ప్లాన్ అమలు.. | air india merging vistara to become market leader in indian aviation sector

air india merging vistara to become market leader in indian aviation sector
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X