For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూకే-భారత్ మధ్య 24 నుండి 30 వరకు ఎయిరిండియా విమానాలు రద్దు

|

భారత్-యూకే మధ్య ఎయిరిండియా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్ 24వ తేదీ నుండి 30 ఏప్రిల్ వరకు రద్దు చేస్తున్నట్లు జాతీయ విమానయాన సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో యూకేలో కఠన చర్యలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

'యూకే-భారత్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణీకులు ఇటీవలి కరోనా ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలి, రెండు దేశాల మధ్య 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాకపోకలు రద్దు చేయబడ్డాయి' అని ఎయిరిండియా ట్వీట్ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరగబెడుతోన్న విషయం తెలిసిందే. భారత్‌లో సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది.

Air India flights to and from the UK cancelled between 24th to 30th April

ప్రయాణీకుల రీషెడ్యూలింగ్, రీఫండ్, మాఫీ గురించిన సమాచారాన్ని ఎయిరిండియా త్వరలో అప్ డేట్ చేయనుంది. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్య వారానికి ఓసారి విమాన ప్రయాణాన్ని షెడ్యూల్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపింది.

English summary

యూకే-భారత్ మధ్య 24 నుండి 30 వరకు ఎయిరిండియా విమానాలు రద్దు | Air India flights to and from the UK cancelled between 24th to 30th April

Air India flights to and from the United Kingdom has been cancelled between 24th to 30th April due to the fresh restrictions imposed by the UK, the national carrier informed on Wednesday. "Passengers who were to travel between India & UK may note that in view of recent restrictions announced by the UK, flights from/to the UK stand cancelled from 24th to 30th April 2021," Air India said on Twitter.
Story first published: Wednesday, April 21, 2021, 21:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X