For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100% sale of Air India: ఎయిరిండియా కొనుగొలుకు మొగ్గు చూపేదెవరు?

|

ప్రభుత్వరంగ ఎయిరిండియా 100 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం వాటాల విక్రయం కోసం బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది. 2018లో తొలిసారి 76% వాటాను విక్రయించేందుకు ప్రయత్నించిన మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు రెండోసారి మొత్తం వాటాలు విక్రయించాలని భావిస్తోంది. నాడు 5.1 బిలియన్ డాలర్లు కోట్ చేయడంతో బిడ్స్ దాఖలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు.

భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, పసిడి దెబ్బతో తగ్గిన వాణిజ్య లోటుభారీగా తగ్గిన బంగారం దిగుమతులు, పసిడి దెబ్బతో తగ్గిన వాణిజ్య లోటు

3.26 బిలియన్ డాలర్ల రుణం

3.26 బిలియన్ డాలర్ల రుణం

ఎయిరిండియాలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో వాటాలు అప్పగిస్తామని చెబుతున్నారు. బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. క్వాలిఫై అయిన బిడ్డర్స్‌ను మార్చి 31న నోటిఫై చేస్తారు. బిడ్స్ వేసేవాళ్లు 3.26 బిలియన్ డాలర్లు రుణాన్ని కూడా అందచేయవలసి ఉంటుంది. ఈ కొనుగొలుకు మొదట దేశీయ సంస్తలకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. విదేశీ సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

పోటీలో ఎవరుంటారు?

పోటీలో ఎవరుంటారు?

సోమవారం ప్రిలిమినరీ బిడ్స్‌ను ఆహ్వానిస్తుండటంతో ఎయిరిండియాను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎయిరిండియా కొనుగోలుకు మొగ్గుచూపే బయ్యర్లు ఈ ఏడాది మార్చి 17 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు స్పందించాల్సి ఉంటుంది. ఎయిరిండియాను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్, హిందూజాలు, ఇండిగో, స్పైస్ జెట్ సహా కొన్ని ప్రయివేటు ఈక్విటీ సంస్థలు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. కొన్ని విదేశీ సంస్థలు కూడా ఉండే అవకాశముంది.

మహారాజా మస్కట్

మహారాజా మస్కట్

ఎయిరిండియా మహారాజా మస్కట్‌గా పేరుగాంచింది. దేశంలో, అంతర్జాతీయంగా ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్స్ కలిగి ఉంది. మందగమనంతో పాటు ఎయిరిండియా నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ సంస్థకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్‌వర్క్, లండన్, దుబాయ్ వంటి చోట్ల విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రైట్స్, స్లాట్స్, సాంకేతిక సిబ్బంది ఉండటం, పెద్ద సంఖ్యలో విమానాలు ఉన్నాయి. దీంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించవచ్చునని చెబుతున్నారు.

12.7 శాతం డొమెస్టిక్ మార్కెట్

12.7 శాతం డొమెస్టిక్ మార్కెట్

ఎయిరిండియాని 1932లో మెయిల్ క్యారియర్‌గా ప్రారంభించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా ప్రొవిజనల్ నెట్ లాస్ రూ.8,556.35 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఈ నష్టం రూ.5,348.18 కోట్లుగా ఉంది.

ఎయిరిండియాకు 12.7 శాతం డొమెస్టిక్ మార్కెట్ ఉంది. 2019లో ఇది 18.36 లక్షల డొమెస్టిక్ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. 2018లో 17.61 మంది ఎయిరిండియాలో ప్రయాణించారు.

English summary

100% sale of Air India: ఎయిరిండియా కొనుగొలుకు మొగ్గు చూపేదెవరు? | Air India bidders must absorb $3.3 billion debt to buy airline

The government on Monday announced plans to sell its entire stake in Air India in a revised push to sell its national carrier after an initial attempt to sell a majority stake in the airline failed to draw a single bid in 2018.
Story first published: Monday, January 27, 2020, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X