For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Q2 GDP data today: భారీ పతనం తర్వాత.. ఎవరి అంచనా ఏమిటి?

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మైనస్‌లలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా 23.9 శాతం పతనమైంది. రెండో త్రైమాసికంలో జీడీపీ మైనస్ 10 శాతం నుండి మైనస్ 14 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటి త్రైమాసికంలో వృద్ధి రికార్డు స్థాయిలో పతనమైన నేపథ్యంలో రెండో త్రైమాసికంపై అందరి దృష్టి ఉంది. అన్-లాక్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ జీడీపీ డేటా నేడు రానుంది.

డిసెంబర్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు! ఏ దేశాలకు వెళ్లవచ్చు..డిసెంబర్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు! ఏ దేశాలకు వెళ్లవచ్చు..

వ్యవసాయ రంగం మినహా...

వ్యవసాయ రంగం మినహా...

కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో దాదాపు మూడు నెలల పాటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ దశలో ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధి రేటు 24 శాతం ప్రతికూలత నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో అన్ని రంగాలు పడకేయగా, కేవలం వ్యవసాయ రంగం మాత్రమే 3.4 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాలు వరుసగా 39.3 శాతం, 23.3 శాతం, 50.3 శాతం పడిపోయాయి. ట్రేడ్, ట్రాన్సుపోర్ట్, కమ్యూనికేషన్స్, ఇతర సేవలు దాదాపు 47 శాతం ప్రతికూలత నమోదు చేశాయి.

సెప్టెంబర్‌లో పుంజుకున్న వృద్ధి

సెప్టెంబర్‌లో పుంజుకున్న వృద్ధి

అన్-లాక్ తర్వాత కార్యకలాపాలు క్రమంగా పుంజుకున్నాయి. ఆగస్ట్ నాటికి కార్యకలాపాల్లో వృద్ధి కాస్త కనిపించింది. సెప్టెంబర్ నెలలో ఎగుమతులు, దిగుమతులు, ఆటో సేల్స్ ఇలా వివిధ రంగాలు ఏడాది ప్రాతిపదికన వృద్ధిని నమోదు చేశాయి. రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, రైల్వే రవాణా కూడా 2019 సెప్టెంబర్‌తో పోలిస్తే పెరిగాయి. అక్టోబర్ నెలలో ఎగుమతులు, దిగుమతులు మళ్లీ పడిపోయాయి. జీఎస్టీ కలెక్షన్స్ కూడా రూ.1 లక్ష కోట్లు దాటాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది. దీంతో సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు గత అంచనాల కంటే కాస్త సానుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఎవరేమి అంచనా వేశారు...

ఎవరేమి అంచనా వేశారు...

జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటుపై ఆర్బీఐ సహా వివిధ సంస్థలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో మైనస్ 8.6 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక, ఇండియా రేటింగ్స్ (మైనస్ 11.9 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మైనస్ 10.7 శాతం), నోమురా (మైనస్ 10.4 శాతం), కేర్ రేటింగ్స్ (మైనస్ 9.9 శాతం), ఇక్రా లిమిటెడ్ (మైనస్ 9.5 శాతం), కొటక్ మహీంద్ర బ్యాంకు (మైనస్ 9.1 శాతం), డచ్ బ్యాంకు (మైనస్ 9 శాతం), బార్క్‌లేస్ (మైనస్ 8.5 శాతం), బోఫా మెరిల్ లించ్ (మైనస్ 8.2 శాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (మైనస్ 8 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (మైనస్ 8 శాతం), మోతీలాల్ ఓస్వాల్ (మైనస్ 6 శాతం) అంచనా వేశాయి.

English summary

Q2 GDP data today: భారీ పతనం తర్వాత.. ఎవరి అంచనా ఏమిటి? | After nearly 24 percent contraction in Q1, all eyes on Q2 GDP data due on November 27

After the steepest fall in its independent history during the lockdown months, India’s economy is recovering. Just how strong the beginning of that recovery has been will be clear when the National Statistics Office releases the July-September quarter gross domestic product data on November 27.
Story first published: Friday, November 27, 2020, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X