For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aether Industries IPO: బిడ్డింగ్ బుకింగ్ ఓపెన్స్: ఇన్వెస్ట్ చెయ్యొచ్చా?

|

ముంబై: పారిశ్రామిక రంగానికి చెందిన మరో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఇవ్వాళ ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. ఈ ఉదయం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉంటుంది. మొత్తంగా 808 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలనే లక్ష్యంతో ఈథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూను జారీ చేసింది. గుజరాత్‌కు చెందిన కెమికల్ ఇండస్ట్రీ ఇది.

ప్రైస్ బ్యాండ్ ఇదీ..

ప్రైస్ బ్యాండ్ ఇదీ..

ఈథర్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ బ్యాండ్‌ 610 నుంచి 642 రూపాయలు. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందే సోమవారమే ఇష్యూ అందుబాటులోకి వచ్చింది. ఒక్కో లాట్‌లో 23 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా ఒక లాట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తొలి రెండు గంటల్లో మంచి ఆదరణే లభించింది ఈ పబ్లిక్ ఇష్యూకు. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. ఉదయం 11:05 నిమిషాల వరకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దాఖలైన బిడ్డింగ్స్ 0.08 శాతం. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా అధికం. 0.17 శాతం మేర రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్డింగ్స్‌ను దాఖలు చేశారు.

జీఎంపీ అంచనాలిలా..

జీఎంపీ అంచనాలిలా..

నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఆదరణ ఫర్వాలేదనిపించుకుంది. తొలుత 757 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయాలని ఈథర్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం తన ఐపీఓ సైజును తగ్గించింది. 627 కోట్లకు కుదించుకుంది. ఇదే కాకుండా ప్రమోటర్ల రూపంలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా మరో 28.2 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కాగా ఇవ్వాళ్టి గ్రే మార్కెట్ ప్రీమియం నాలుగు రూపాయలుగా సూచిస్తోంది. అంటే ఐపీఓ కటాఫ్ ధర 642 కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నాలుగు రూపాయల లాభంతో లిస్టింగ్ అవుతుందని గ్రే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

కొత్త ప్రాజెక్టుల కోసం..

కొత్త ప్రాజెక్టుల కోసం..

పబ్లిక్ ఇష్యూ రూపంలో సమీకరించిన మొత్తాన్ని కొత్త ప్రాజెక్టులకు మళ్లిస్తామని ఈథర ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం పేర్కొంది. ఈ విషయాన్ని ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్‌కు అందజేసిన తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. మూల ధన వ్యయ అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఐపీఓ ద్వారా వచ్చే పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వినియోగిస్తామని, రుణాల చెల్లింపులకు మరికొంత మొత్తాన్ని వినియోగిస్తామని పేర్కొంది.

అలాట్‌మెంట్ ఇలా..

అలాట్‌మెంట్ ఇలా..

మొత్తం ఐపీఓలో సంస్థాగత ఇన్వెస్టర్లు- 35, రీటైల్ ఇన్వెస్టర్లు- 15 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు. ఈథర్ ఇండస్ట్రీస్ స్పెషలైజ్డ్ కెమికల్స్ తయారీ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ. ఫార్మాస్యూటికల్, ఆగ్రోకెమికల్, మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రానిక్ కెమికల్‌ వంటి రంగాలకు తన ప్రొడక్ట్స్‌ను సరఫరా చేస్తోంది. ఈ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ రెవెన్యూ 2021-22లో 450 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ ఐపీఓను హె‌చ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర కేపిటల్స్ కంపెనీ- పర్యవేక్షిస్తోన్నాయి.

English summary

Aether Industries IPO: బిడ్డింగ్ బుకింగ్ ఓపెన్స్: ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? | Aether Industries IPO opens today, Price band GMP and other details are here to know

Aether Industries IPO open for public subscription and conclude on May 26. The firm has fixed a price band of Rs 610-642 per share for its issue.
Story first published: Tuesday, May 24, 2022, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X