For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదానీ పోర్ట్స్‌కు అమెరికా ఎస్&పీ షాక్, లిస్టింగ్ నుండి తొలగింత!

|

అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మయన్మార్ మిలిటరీతో బిజినెస్ సంబంధాలు ఉన్నాయని కారణం చెబుతూ లిస్టింగ్ నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్‌ను తమ సస్టైనబిలిటీ సూచీ నుండి తొలగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ డౌజోన్స్ ఇండెక్సెస్ వెల్లడించింది.

అదానీ పోర్ట్స్ కంపెనీ యంగూన్‌లో ఓ రేవును నిర్మిస్తోంది. దీంతో పాటు మయన్మార్ ఎకనామిక్ కార్పొరేషన్(MEC) నుండి భూమిని లీజుకు తీసుకున్నది. ఈ నేపథ్యంలో మయన్మార్ సైన్యంతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ అంశంపై అదానీ గ్రూప్ స్పందించవలసి ఉంది. అదానీ పోర్ట్స్ వ్యాపార విభాగం MEC నుండి భూమిని లీజుకు తీసుకున్న అంశంపై అదానీ గ్రూప్ గత నెలలో స్పందించింది. ఈ ఒప్పందంలోని భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని వెల్లడించింది.

Adani Ports to be removed from S&P index due to business links with Myanmar military

ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అక్కడి ప్రజా ఉద్యమాన్ని సైన్యం అణిచివేస్తోంది. వందలాది మంది పౌరులు మరణించారు. దీంతో అమెరికా, బ్రిటన్ దేశాలు మయన్మార్ ఎకనమిక్ కారిడార్, మయన్మార్ ఎకనమిక్ హోల్డింగ్స్, పబ్లిక్ కంపెనీ లిమిటెడ్స్ పైన ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ను గురువారం ట్రేడింగ్‌కు ముందు లిస్టింగ్ నుండి తొలగించే అవకాశముంది.

English summary

అదానీ పోర్ట్స్‌కు అమెరికా ఎస్&పీ షాక్, లిస్టింగ్ నుండి తొలగింత! | Adani Ports to be removed from S&P index due to business links with Myanmar military

S&P Dow Jones Indices said it is removing India’s Adani Ports and Special Economic Zone Ltd from its sustainability index due to the firm’s business ties with Myanmar’s military which is accused of human rights abuses after a coup this year.
Story first published: Tuesday, April 13, 2021, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X