For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంగవరం పోర్ట్ అదానీ చేతికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం

|

గంగవరం విమానాశ్రయంలో అదానీ పోర్ట్స్‌కు 10.4 శాతం వాటాకు అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గంగవరం పోర్ట్‌లో 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించినట్లు అదానీ పోర్ట్స్ మంగళవారం తెలిపింది. 'ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు నుండి 23 ఆగస్ట్ 2021 తేదీతో కూడిన ఆమోదపు లేఖను 24 ఆగస్ట్ 2021న అందుకున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10.4 శాతం వాటాకు ఆమోదం తెలిపింది' అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ అప్పుడే ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ది చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.1 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉంది. రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. డీవీఎస్ రాజు కన్సార్టియంకు చెందిన వాటాను రూ.3604 కోట్లకు, విండీ లేక్ సైడ్ వాటాను రూ.1954 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసింది. తద్వారా పోర్టును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.

Adani Ports get Andhra Government’s nod for 10.4% stake in Gangavaram Port

కాగా ఈ అక్వైజేషన్ పూర్తి కావడానికి నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. గంగవరం పోర్ట్ నుండి డ్రై బల్క్, బ్రేక్ బల్క్ సహా వివిధ కార్గో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గంగవరం పోర్ట్ రెవెన్యూ FY19లో రూ.964 కోట్లు కాగా, FY20లో రూ.1082 కోట్లు, FY21లో రూ.1057 కోట్లుగా నమోదయింది.

English summary

గంగవరం పోర్ట్ అదానీ చేతికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం | Adani Ports get Andhra Government’s nod for 10.4% stake in Gangavaram Port

Adani Ports announced on Tuesday that the Andhra Pradesh government has approved the proposal of acquisition of 10.4 per cent stake of Gangavaram Port Limited for Rs 644.78 crore.
Story first published: Wednesday, August 25, 2021, 19:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X