For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani News: నీటిపై కన్నేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. రూ.20 వేల కోట్ల సేకరణ దేనికంటే..?

|

Adani News: దేశంలోని గాలి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ అదానీ గ్రూప్ తన వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే ఈ వ్యాపార సమూహం పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, విద్యుత్ ఉత్పత్తి & పంపిణీ, సిమెంట్ తయారీ, డేటా సెంటర్లు వంటి అనేక వ్యాపారాల్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పటికీ కంపెనీ తన విస్తరణ వాదాన్ని వీలైనంత ముందుకు తీసుకెళ్లేందుకే మెుగ్గు చూపుతోంది.

వాటాల విక్రయం..

వాటాల విక్రయం..

అదానీ గ్రూప్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వాటాలని విక్రయించాలని నిర్ణయించినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుకేశీందర్ సింగ్ తెలిపారు. వచ్చే వారం ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ నుంచి రూ.20,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.3,112-3,276 మధ్య ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇది విజయవంతమైతే కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద FPO ఫ్లేట్ చేసిన కంపెనీగా అవతరిస్తుంది.

కొత్త వ్యాపారంలోకి అదానీ..

కొత్త వ్యాపారంలోకి అదానీ..

ఇప్పటి వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అదానీ కన్ను ఇప్పుడు నీటిపై కూడా పడింది. కంపెనీ వాటర్ ఫ్యూరిఫికేషన్, ట్రీట్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ వంటి రంగాల్లోని వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించిందని జుకేశీందర్ సింగ్ వెల్లడించారు. నీటి రంగంలో ఉన్న అవకాశాలను గ్రూప్ అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది. అయితే సొంతంగా ముందుకు సాగాలా లేక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌లు, కంపెనీల కొనుగోలు చేయాలా అనే వ్యూహాలను కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌లో నీరు ప్రధాన అంశం కాబట్టి కంపెనీ దీనిపై దృష్టి సారించినట్లు సింగ్ తెలిపారు.

వేల కోట్లు ఏం చేస్తారంటే..

వేల కోట్లు ఏం చేస్తారంటే..

ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన రూ.20 వేల కోట్లలో రూ.10,869 కోట్లను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ప్రస్తుత విమానాశ్రయాల్లో పనులు, గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కంపెనీ వినియోగించనుంది. ఇక రూ. 4,165 కోట్లను విమానాశ్రయాలు, రోడ్లు, సోలార్ ప్రాజెక్ట్ అనుబంధ సంస్థల కోసం తీసుకున్న రుణ చెల్లింపులకు కంపెనీ వినియోగించనుంది.

భవిష్యత్తు ఇంధనం..

భవిష్యత్తు ఇంధనం..

గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థలో.. 3 మిలియన్ టన్నుల వరకు గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రానున్న 10 ఏళ్లలో గ్రూప్ దాదాపు 50 బిలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించినట్లు గతంలో ప్రకటించింది. ఇదే క్రమంలో గుజరాత్‌ ముంద్రా సెజ్‌లో తన సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 10 gw వరకు విస్తరించాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary

Adani News: నీటిపై కన్నేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. రూ.20 వేల కోట్ల సేకరణ దేనికంటే..? | Adani Enterprises planning to enter into water segment business know details

Adani Enterprises planning to enter into water segment business know details
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X