For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: తారుమారైన బిలియనీర్లు.. కిందకు పడిపోయిన అదానీ.. SEBI టార్గెట్ ఫిక్స్..!

|

Billionaires: అమెరికా సంస్థ నివేదికతో గౌతమ్ అదానీ సంపద వేగంగా ఆవిరౌతోంది. గతంలో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానాన్ని అధిరోహించిన అదానీ తాజా పరిణామాలతో ఢమాలున కింది స్థానానాకి దిగాజారారు.

భారీ నష్టం..

భారీ నష్టం..

2023 భారత పారిశ్రామికవేత్తలకు అస్సలు కలిసిరావటం లేదని చెప్పుకోవచ్చు. హిండెన్ బర్గ్ రిపోర్టు ప్రభావం అదానీ సంపదపై భారీగా పడిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ కేవలం రెండు రోజుల్లో ఏకంగా రూ.2.37 లక్షల కోట్లు తగ్గింది. దీంతో ఆయన నికర విలువ డాలర్లలో 100.4 బిలియన్లకు చేరుకుంది.

ఏడో స్థానానికి..

ఏడో స్థానానికి..

బిలియనీర్ బిజినెస్ మెస్ అదానీ సంపద తగ్గటంతో ఆయన ఫోర్బ్స్ రియల్ టైం జాబితా ప్రకారం ఏడో స్థానానికి దిగజారారు. దీనికి ముందు ఐదవ స్థానంలో అమెరికా ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, ఆరవ స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. ఇక ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 83.1 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానానికి పరిమితమయ్యారు.

అగ్రస్థానంలో ఎవరంటే..

అగ్రస్థానంలో ఎవరంటే..

టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పుల తర్వాత ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 215 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తూ 170.1 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇక మూడో స్థానంలో అమెజాన్ సహవ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 122.4 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.

కుప్పకూలుతున్న అదానీ..

కుప్పకూలుతున్న అదానీ..

రెండు రోజులు గడిచినప్పటికీ అదానీ షేర్ల విక్రయాల వెల్లువ అస్సలు తగ్గలేదు. ఈ రోజు సైతం రెండక్కెల్లో అదానీ స్టాక్స్ నష్టాన్ని నమోదు చేశాయి. గ్రూప్ కంపెనీలైన ఏసీసీ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ విల్మర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల షేర్లు అత్యధికంగా 20 శాతం వరకు నష్టపోయాయి. కొన్ని కంపెనీలు సర్క్యూట్ బ్రేకర్లను తాకాయి. రేజు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది.

స్టడీ చేస్తున్న సెబీ..

అదానీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ హిందెన్ బెర్గ్ ఇచ్చిన రిపోర్టును సెబీ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో ఇచ్చిన వివరాలు అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ ఫండ్స్ బదలాయింపు వ్యవహారం దర్యాప్తులో వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల అదానీ గ్రూప్ చేస్తున్న డీల్స్ వ్యవహారాలను మార్కెట్ రెగ్యులేటరీ చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary

Adani: తారుమారైన బిలియనీర్లు.. కిందకు పడిపోయిన అదానీ.. SEBI టార్గెట్ ఫిక్స్..! | Adani companies lost wealth and sebi increased scrutiny know details

Adani companies lost wealth and sebi increased scrutiny know details
Story first published: Friday, January 27, 2023, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X