For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ambani-Adani: అంబానీ అదానీ అరంగేట్రం.. వ్యాపార విస్తరణపై కన్ను.. వణికిపోతున్న మిగిలిన కంపెనీలు..

|

Ambani-Adani: దేశంలో కుబేరులుగా ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పుడు వీరి కన్ను వైద్య రంగంపై పడింది. వారు ఈ రంగంలో అగ్రగామి ప్లేయర్లుగా మారేందుకు నిర్ణయించుకున్నారు.

క్లినికల్ ట్రయల్స్..

క్లినికల్ ట్రయల్స్..

ప్రస్తుతం దేశంలో క్లినికల్ ట్రయల్ సెంటర్‌ల వ్యాపారం, డిమాండ్‌లో భారీ పెరుగుదల ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ రంగంలో అధిక నగదు ప్రవాహం, డిమాండ్, అధిక లాభాలు, సులభంగా వ్యాపార విస్తరణకు అవకాశం ఉండటమే. ఈ రంగం ఇప్పుడు అనేక మంది వ్యాపారులను, ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అందుకే ఫార్మా కంపెనీలు, ఆసుపత్రులు, స్టార్టప్‌లు మరియు పెద్ద పారిశ్రామిక సంస్థలు కూడా భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. 3 ఏళ్లుగా విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయి.

అదానీ గ్రూప్..

అదానీ గ్రూప్..

ఈ నేప‌థ్యంలో అదానీ గ్రూప్ మే నెల‌లో అదానీ హెల్త్ వెంచర్స్‌ను ఏర్పాటు చేసి వైద్య, డయాగ్నస్టిక్ సెంటర్లు, హెల్త్ కేర్, టెక్ బేస్డ్ హెల్త్ సర్వీసెస్, రీసెర్చ్ సెంటర్స్ సంబంధిత కార్యకలాపాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించింది.

రిలయన్స్, టాటా..

రిలయన్స్, టాటా..

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020 ఆగస్టులో డ్రగ్‌మేకర్ నెట్‌మెడ్స్ ను రూ.620 కోట్లకు కొనుగోలు చేయగా, టాటా గ్రూప్ జూన్ 2021లో రూ.720 కోట్లకు 1MGని కొనుగోలు చేసింది. ఇలా అగ్రగామి బిజినెస్ హౌసెస్ ఈ రంగంలోకి అడుగుపెట్టాయి.

లుపిన్, టోరెంట్ ఫార్మా..

లుపిన్, టోరెంట్ ఫార్మా..

జూలై 2022లో ఫార్మాస్యూటికల్ కంపెనీ లుపిన్ తన సొంత క్లినికల్ ట్రయల్ కంపెనీ లుపిన్ డయాగ్నోస్టిక్స్‌ని ప్రారంభించింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టోరెంట్ ఫార్మా ఫిబ్రవరి 2022లో టోరెంట్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ప్రారంభించింది.

థైరోకేర్..

థైరోకేర్..

జూన్ 2021లో ఈ-ఫార్మసీ కంపెనీ ఫార్మ్‌ఈజీ క్లినికల్ ట్రయల్ కంపెనీ థైరోకేర్‌ను దాదాపు రూ. 4,546 కోట్లకు కొనుగోలు చేసింది. ఫార్మసీ రీటైలర్ మెడ్‌ప్లస్ మార్చి 2022లో హైదరాబాద్‌లో క్లినికల్ ట్రయల్ సెంటర్‌ను ప్రారంభించింది.

హాస్పిటల్స్..

హాస్పిటల్స్..

ఇదే క్రమంలో గుర్గావ్ ప్రధాన కార్యాలయం మాక్స్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ కంపెనీ ఆస్టర్ DM కూడా రంగంలోకి ప్రవేశించాయి. దీని కారణంగా వచ్చే 10 ఏళ్లలో క్లినికల్ ట్రయల్ రంగం భారీ స్థాయికి చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

English summary

Ambani-Adani: అంబానీ అదానీ అరంగేట్రం.. వ్యాపార విస్తరణపై కన్ను.. వణికిపోతున్న మిగిలిన కంపెనీలు.. | Adani And Ambani Entered Into Diagnostics Business In Health sector

Adani And Ambani Entered Into Diagnostics Business In Health sector
Story first published: Monday, October 24, 2022, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X