For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Accenture: మాంద్యంలో యాక్సెంచర్ వార్నింగ్ బెల్.. ఆందోళనలో ఇండియన్ ఐటీ కంపెనీలు..!

|

Accenture: ప్రపంచం మాంద్యం బారిన పడి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం యాక్సెంచర్ భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలను భయపెట్టే కీలకి ప్రకటన చేసింది. ఇది ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది.

మాంద్యం క్రమంలో..

మాంద్యం క్రమంలో..

మాంద్యం సమయంలో అందరూ ఖర్చులను తగ్గించుకోవాలనే చూస్తారు. ఈ క్రమంలో కొత్త ఉత్పత్తులను, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయటానికి ఇష్టపడరు. ఈ క్రమంలో ఎగుమతులపై ఆధారపడిన దేశీయ ఐటీ కంపెనీలు గత మూడు నెలలుగా తమ వ్యాపారంలో తీవ్ర క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది. యాక్సెంచర్ సైతం దీనిని ధృవీకరించే వార్నింగ్ ఇచ్చింది.

యాక్సెంచర్ మాట..

యాక్సెంచర్ మాట..

డబ్లిన్, ఐర్లాండ్ ప్రధాన కార్యాలయంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న యాక్సెంచర్ ఖర్చుల మదింపుపై శుక్రవారం కామెంట్ చేసింది. ప్రస్తుతం ఐటీ సేవలపై ఖర్చు చేసే కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. యాక్సెంచర్ అంచనాల మధ్య ఈ రోజు దేశీయ టెక్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో చతికిల పడ్డాయి.

స్టాక్ మార్కెట్..

స్టాక్ మార్కెట్..

బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ లోని టాప్-30 కంపెనీలన్నీ లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్ సీఎల్ మాత్రమే నష్టాల్లో ముగిసాయి. మరీ ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ సమయంలో ఒక శాతానికి పైగా పడిపోయాయి. అలాగే శుక్రవారం యాక్సెంచర్ షేర్లు 6 శాతం వరకు పడిపోయాయి. చాలా ఐటీ కంపెనీలు ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్ట్‌లపై పెట్టుబడులు పెడుతున్న తరుణంలో ఆర్థిక మందగమనం ఆవరించటం కంపెనీల లాభదాయకతను క్షీణింపచేస్తోంది.

HCL ప్రకటన..

HCL ప్రకటన..

ఇదే క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం HCL ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయ వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉంటుందని ప్రకటించింది. అలాగే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఈ ఏడాదికి తన రాబడి, లాభాల అంచనాలను తగ్గించుకుంటున్నట్లు గతనెలలో ప్రకటించింది. నవంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో యాక్సెంచర్ మెరుగైన రాబడి, లాభాలను నివేదించింది. అలా త్రైమాసిక అమ్మకాలు 5 శాతం పెరిగి 15.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.

Read more about: accenture it tech news business news
English summary

Accenture: మాంద్యంలో యాక్సెంచర్ వార్నింగ్ బెల్.. ఆందోళనలో ఇండియన్ ఐటీ కంపెనీలు..! | Accenture Warned IT companies over slowdown and Indian IT stocks Fell Know Details

Accenture Warned IT companies over slowdown and Indian IT stocks Fell Know Details
Story first published: Tuesday, December 20, 2022, 9:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X