For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bitcoin News: వేల కోట్ల విలువైన బిట్ కాయిన్లు చెత్త పాలు.. అవును బాస్ ఇది నిజం.. వెతికేందుకు రోబో..

|

Viral Bitcoin News: టైమ్ బ్యాండ్ అంటే ఇదేనేమో. వేల కోట్ల రూపాయలు విలువ చేసే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్లను ఎవరైనా చెత్తబుట్టలో వేస్తారా.? వినటానికి ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికీ.. నిజంగా జరిగింది ఫ్రెడ్స్. అసలు ఈ ఘటన లండన్, వేల్స్ ప్రావిన్స్‌లోని న్యూపోర్ట్ నగరంలో జరిగింది. అక్కడ నివసించే జేమ్స్ హోవెల్స్ 2013లో తన హార్డ్ డిస్క్‌లో ఒకదాన్ని చెత్త కుండీలో పడేశాడు. అతను ఆ హార్డ్ డిస్క్‌లో 8000 బిట్‌కాయిన్‌లను సేవ్ చేశాడు. వాటి విలువ దాదాపు 17.6 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ.1,400 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్‌ను కనుగొనడానికి వారు రూపొందించిన ప్లాన్ మరో 11 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది.

 తొమ్మిదేళ్ల క్రితం..

తొమ్మిదేళ్ల క్రితం..

2013లో జేమ్స్ హోవెల్స్ తన హార్డ్ డిస్క్‌లలో ఒకదాన్ని చెత్త కుండీలో విసిరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అందులో 8000 బిట్ కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు జేమ్స్ ఎలాగైనా దాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నాడు. డస్ట్‌బిన్‌లో ఉన్న చెత్తను తొలగించి డంపింగ్ గ్రౌండ్‌లో వేసి ఉండవచ్చని అతడు భావిస్తున్నాడు. ఆ హార్డ్‌డిస్క్‌ని చెత్తతో పాటు అక్కడే పడేసి ఉండొచ్చు. అయితే.. ఇప్పుడు ఆ డంపింగ్ గ్రౌండ్ నుంచి హార్డ్ డిస్క్‌ను రికవర్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ పని కోసం ఇంకో రూ.88 కోట్లను వెచ్చిస్తున్నాడు.

 రోబో డాగ్స్ వినియోగం..

రోబో డాగ్స్ వినియోగం..

హార్డ్ డిస్క్ సెర్చ్ ఆపరేషన్‌లో రెండు రోబోట్ డాగ్‌లను ఉపయోగించాలనుకుంటున్నట్లు వెల్స్ న్యూస్‌లో వార్తలు వచ్చాయి. ఈ రోబో డాగ్స్ ధర దాదాపు 75,000 డాలర్లని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం వీటి విలువదాదాపు రూ.60 లక్షల వరకు ఉంటుంది. ఈ రోబోట్ డాగ్స్ 2020లో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణ, గొర్రెలను మందల్లో ఉంచడం, కొన్ని ఇతర పనులకు కూడా ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోంది.

డంపింగ్ యార్డ్ స్కానింగ్..

డంపింగ్ యార్డ్ స్కానింగ్..

రోబోట్ డాగ్స్ రోమింగ్ సీసీటీవీ కెమెరాలుగా, గ్రౌండ్ స్కాన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పనికోసం రెండు రోబో డాగ్స్ అవసరమవుతాయి. ఎందుకంటే.. ఒక రోబోట్ పని చేస్తున్నప్పుడు, మరొకటి విశ్రాంతి తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక్కడ విశ్రాంతి అంటే ఆ సమయంలో అవి ఛార్జింగ్‌ అవుతుంటాయి.

 సెర్చ్ కు అడ్డంకులు..

సెర్చ్ కు అడ్డంకులు..

న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ దానిని అనుమతించడానికి నిరాకరిస్తోంది. డంపింగ్ గ్రౌండ్ నుంచి హార్డ్ డిస్క్ దొరికే అవకాశాలు చాలా తక్కువని కౌన్సిల్ చెబుతోంది. జెస్ ప్లాన్ ఆ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ఈ పథకానికి కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. పాపం.. ఈ వ్యక్తి తన పోగొట్టుకున్న బిట్ కాయిన్లను ఎలా తిరిగి పొందుతాడో ఎదురు చూడాల్సిందే.

English summary

Bitcoin News: వేల కోట్ల విలువైన బిట్ కాయిన్లు చెత్త పాలు.. అవును బాస్ ఇది నిజం.. వెతికేందుకు రోబో.. | a man thown his hard disc containing bitcoins worth 1400 crores into dustbin in london

a man thown his hard disc containing bitcoins worth 1400 crores know details
Story first published: Wednesday, July 27, 2022, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X