For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral: వీడు పట్టువదలని విక్రమార్కుడు.. డ్రీమ్ జాబ్ కొట్టేశాడు.. 39 సార్లు ఓడినా గూగుల్ ని వదల్లేదు..

|

Google: డ్రీమ్ జాబ్ పొందాలనుకోవటం చాలా మందికి ఒక కల. అందుకోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ.. కొంత మంది పలు సార్లు తిరస్కరణలకు గురైన తర్వాత ప్రయత్నాలు మానుకుంటుంటారు. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైనవాడు.

గూగుల్ లో ఉద్యోగం కోసం..

గూగుల్ లో ఉద్యోగం కోసం..

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టైలర్ కోహెన్ అనే వ్యక్తి గూగుల్ లో జాబ్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించాడు. అందులో భాగంగా సుమారు 39 సార్లు రిజెక్ట్ అయ్యాడు. అయితేనేం.. పట్టువదలకుండా ప్రయత్నాలు కొనసాగించటంతో 40వ సారి విజయాన్ని సాధించాడు. డ్రీమ్ జాబ్ సాధించాలనే దృఢ సంకల్పం అతడిని ముందుకు నడిపింది.

లింక్‌డిన్ వివరాలు..

లింక్‌డిన్ వివరాలు..

అతను తన లింక్‌డిన్ ఖాతాలో Googleతో తన కమ్యూనికేషన్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు. ఉద్యోగం పొందడానికి ముందు డోర్‌డాష్‌లో అసోసియేట్ మేనేజర్ స్ట్రాటజీ & ఆప్స్‌గా పనిచేశారు. దీనికి అతడు 39 తిరస్కరణలు, 1 అంగీకారం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్సోషల్ మీడియాలో మారింది.

2019 నుంచి ప్రయత్నాలు..

2019 నుంచి ప్రయత్నాలు..

కోహెన్ స్క్రీన్ షాట్ అతను 2019లో మొదటిసారిగా Googleకి దరఖాస్తు చేశాడు. చివరకు మూడు సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో చేరినట్లు వెల్లడించాడు. ఒక వినియోగదారు తాను అమెజాన్‌కు 120+ సార్లు దరఖాస్తు చేసుకున్నారని, ఆపై కంపెనీలో ఉద్యోగం సంపాదించినట్లు లింక్డ్‌ఇన్ లో రాశారు. అనేక మంది అతని ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

విమర్శలు కూడా..

విమర్శలు కూడా..

అయితే కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇలా వెంబడించటం సరికాదని మరి కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరైతే ఫన్నీగా ప్రశ్నలు అడిగారు.

నెరవేరిన కోరిక..? అదృష్టమా..

నెరవేరిన కోరిక..? అదృష్టమా..

గూగుల్ కంపెనీలో 39 విభిన్నమైన ఉద్యోగ పొజిషన్ల కోసం ఈ అమెరికా వ్యక్తి ఇప్పటి వరకు అప్లై చేశాడు. అయితే ఈ క్రమంలో మే 3న దరఖాస్తు చేసి తిరస్కరించ బడగా.. చిట్టచివరకు మే 6న.. 40వ సారి విజయాన్ని సాధించాడు. దీనిని అనేక మంది అదృష్టం అని కామెంట్ చేస్తున్నారు.

Read more about: google job అమెరికా
English summary

Viral: వీడు పట్టువదలని విక్రమార్కుడు.. డ్రీమ్ జాబ్ కొట్టేశాడు.. 39 సార్లు ఓడినా గూగుల్ ని వదల్లేదు.. | A Man named Tyler Cohen in us gets rejected by Google 39 times and finally hired on his 40th attempt know details

Google Rejected This Man 39 Times And Finally Offer Job To Tyler Cohen His Story Is Now Viral In Social Media
Story first published: Thursday, July 28, 2022, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X