హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను హడావుడిగా కార్యాలయాలకు రప్పించే ఆలోచనతో లేవని హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(HYSEA) సర్వేలో వెల్లడైంది. అలాగే ఉద్యోగులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి వద్ద నుండి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఐటీ సంస్థల వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మహమ్మారి వల్ల ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థలకు మొదట ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపింది.

వృద్ధి సింగిల్ డిజిట్‌కు
గత ఏడాది ఐటీ పరిశ్రమ పద్దెనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఆదాయం, లాభదాయకత వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితం కావొచ్చునని లేదా మార్పులేకుండా ఉండవచ్చునని అంచనా వేసింది. కరోనా కేసుల తగ్గుదల, వ్యాక్సీన్ లభ్యత ఆధారంగా సాఫ్టువేర్ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చే అంశాన్ని నిర్ణయించగలవని చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఆయా రంగాలు అవకాశంగా మలుచుకొని ముందుకు సాగుతున్నాయని, ఇందులో ఐటీ రంగం ఉంది. విద్య, ఫార్మా, ఆరోగ్య రంగాల్లో ఉన్న ఐటీ సంస్థల్లో కరోనా తర్వాత వృద్ధి కనిపిస్తోంది. ఉత్పత్తి, ఇతర విభాగాల్లో ఉన్న ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో కోత తక్కువ..
వ్యాక్సీన్ వచ్చి, అన్ని కుదుటపడేదాకా కంపెనీలు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఐటీ సంస్థల్లో.. అలాగే హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోత, వేతనాల కోత పెద్దగా లేదని తేలింది. ఉద్యోగుల ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉందని ఎక్కువ పెద్ద కంపెనీలు చెప్పగా, 75 శాతానికి పైగా ఉందని 80 శాతం పైగా అన్ని కంపెనీలు తెలిపాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇబ్బందులు
వర్క్ ఫ్రమ్ హోమ్ పట్ల ఉద్యోగుల ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, ఇబ్బందులు మాత్రం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. బ్రాడ్ బ్యాండ్ లభ్యత, పవర్ కట్, పని వాతావరణం, ఉద్యోగులతో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం తక్కువగా ఉందని 34 శాతం కంపెనీలు తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా 70 శాతం నుండి 89 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయిస్తామని 31 శాతం కంపెనీలు తెలిపాయి. పెద్ద సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను 30 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత చాలామంది ఉద్యోగులు క్రమంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, కొంతమంది త్వరగా కార్యాలయాలకు రావాలని ఆసక్తి కనబరుస్తున్నారు.

కొత్త ఉద్యోగాలు..
ఐటీ సంస్థల్లో దాదాపు 70 శాతం పెద్ద కంపెనీలు కరోనా ఉన్న ఆరు నెలల కాలంలో కొత్త నియామకాలు చేపట్టాయి. ఈ ఆరు నెలల కాలంలో ఒకటి నుండి వెయ్యి మంది వరకు ప్రెషర్లను చేర్చుకున్నట్లు తెలిపాయి. అలాగే, ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను గౌరవిస్తామని చెబుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి నియామకాలు కరోనా పూర్వస్థితికి వస్తాయని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి.

కార్యాలయాలకు దూరం..!
ఐటీ కంపెనీలు చాలా వరకు తమ కార్యాలయాల పరిమాణాలను తగ్గించుకుంటున్నాయి. కొన్ని చిన్న సంస్థలకు అయితే పూర్తిగా కార్యాలయాలు మూసివేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఆఫీస్‌లు తెరుచుకోవడానికి సమయం పట్టడంతో పాటు పూర్తిగా ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కార్యాలయ పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. వ్యాక్సీన్ వస్తే ఐటీ రంగం వేగంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications