For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడేళ్ళలో 7 ఎలక్ట్రిక్ వాహన శ్రేణి :గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్ట్రాటజీ చెప్పిన కియా మోటార్స్

|

రానున్న రోజుల్లో పెట్రోల్ ,డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పి ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ ఎక్కువగా చెయ్యాలని ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. ఆటోమొబైల్స్ రంగంలో గణనీయమైన మార్పులు జరగబోతున్నాయి . పొల్యూషన్ కు చెక్ పెట్టే వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకుంటున్న పరిస్థితి . కియా మోటార్స్ రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్లాన్ చేస్తోంది . ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్ట్రాటజీని కూడా ప్రకటించింది.

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యూహం ప్రకటించిన కియా మోటార్స్

భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యూహం ప్రకటించిన కియా మోటార్స్

దక్షిణ కొరియా కార్ల తయారీదారు బ్రాండ్ యొక్క భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన ప్లాన్ ను రివీల్ చేశారు . కొరియాలోని బ్రాండ్ యొక్క హ్వాసుంగ్ ప్లాంట్లో జరిగిన కార్యక్రమంలో కియా యొక్క భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వ్యూహ వివరాలను కియా ప్రెసిడెంట్ మరియు CEO హో సుంగ్ సాంగ్ ప్రకటించారు. ఇప్పటి నుండి 7 ఏళ్ళలో 7 ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకువస్తామని చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై కియా నజర్ ... ప్లాన్ ప్రకటించిన సిఈఓ సాంగ్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై కియా నజర్ ... ప్లాన్ ప్రకటించిన సిఈఓ సాంగ్

గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోవటానికి కియా విభిన్న శ్రేణిలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తుందని , అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ కంపెనీలతో భాగస్వామి అవుతుందని ఆయన పేర్కొన్నారు . కియా 2011 లో మా మొట్టమొదటి భారీగా ఉత్పత్తి చేయబడిన బీఈవీ , కియా రే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 100,000 బీఈవీలను విక్రయించింది" అని CEO సాంగ్ చెప్పారు. అప్పటి నుండి, ప్రపంచ మార్కెట్ల కోసం కొత్త బీఈవీల శ్రేణిని ప్రవేశపెట్టడం ప్రారంభించామని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రక్రియను మరింత స్పీడ్ పెంచుతామని, అందుకోసం ప్రణాళికలను రూపొందించామని ఆయన చెప్పారు .

7 ఏళ్ళలో 7 ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ మార్కెట్ లోకి

7 ఏళ్ళలో 7 ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ మార్కెట్ లోకి

ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంపై దృష్టి సారించటం ద్వారా, 2029 నాటికి మా మొత్తం ప్రపంచవ్యాప్త అమ్మకాలలో 25 శాతం వాటా పొందాలని అనుకుంటున్నామని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు . 2020 ప్రారంభంలో ప్రకటించిన కియా యొక్క 'ప్లాన్ ఎస్' స్ట్రాటజీ కింద, బ్రాండ్ తన బిఇవి లైనప్‌ను 2025 నాటికి 11 మోడళ్లకు విస్తరించాలని యోచిస్తోంది. 2027 నాటికి 7 ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తామని చెప్పారు.

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మార్పులపు శ్రీకారం

భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మార్పులపు శ్రీకారం

ఈ బీఈవీలలో మొదటిది, సివి అనే కోడ్-పేరు 2021 లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్ బీఈవీ గా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి రానుంది. కొత్త మోడల్ కియా యొక్క ఇతర వాహనాల మాదిరిగానే కస్టమర్ అభిరుచికి తగ్గట్టు నాణ్యత మరియు ఆకర్షించే డిజైన్‌ను అందిస్తుంది.

అంతకుముందు జనవరిలో, కియా మోటార్స్ తన ‘ప్లాన్ ఎస్' మధ్య నుండి దీర్ఘకాలిక భవిష్యత్ వ్యూహాన్ని ఆవిష్కరించింది. బీఈవీ మోడళ్లను ప్రారంభించడం ద్వారా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాలలో నాయకత్వ స్థానాన్ని పొందడంపై కియా దృష్టి సారించింది. కియా మోటార్స్ ‘ప్లాన్ ఎస్' కోసం కంపెనీ వ్యాప్తంగా మార్పులకు శ్రీకారం చుట్టనుంది . CV మోడల్, 2021 లో ప్రారంభించబోతున్నందున అది అందుకు తగ్గట్టు, భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మార్పులకు దిగనుంది .

English summary

ఏడేళ్ళలో 7 ఎలక్ట్రిక్ వాహన శ్రేణి :గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్ట్రాటజీ చెప్పిన కియా మోటార్స్ | 7 EVs in 7 years .. Kia Motors says Global Electric Vehicle Strategy

Kia has revealed first stage of future product plans with seven new electric vehicles to launch by 2027 across several vehicle segments.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X