For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్: 65% గ్లోబల్ ఎకానమీ లాక్‌డౌన్, ఆర్థిక సంక్షోభం దిశగా..!

|

కరోనా వైరస్ కారణంగా దేశ, అంతర్జాతీయ వ్యవస్థ కుప్పకూలుతోంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతుంటే అదే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. లాక్ డౌన్ వల్ల దేశీయంగా రూ.9 లక్షల కోట్ల నష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల బిలియన్ డాలర్లు ఉంటుందని ఆర్థిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లుభారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు

65 శాతం షట్‌డౌన్.. ప్రపంచ సంక్షోభం

65 శాతం షట్‌డౌన్.. ప్రపంచ సంక్షోభం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా షట్ డౌన్ లేదా క్వారంటైన్‌లో కొనసాగుతోందని, 65 శాతం గ్లోబల్ ఎకానమీ లాక్ డౌన్‌లో ఉందని, ఇది మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి నెలాఖరు వరకు ఎన్నో ప్రపంచ దేశాలు షట్ డౌన్‌కు పిలుపునిచ్చాయని గుర్తు చేసింది. మరింతకాలం ఈ మహమ్మారి ఉండే అవకాశముందని, ఈ సంక్షోభం మరింతకాలం కొనసాగే ప్రమాదముందని పేర్కొంది.

రిస్క్ అసెట్స్‌పై ఒత్తిడి

రిస్క్ అసెట్స్‌పై ఒత్తిడి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు, బాధితులు పెరుగుతున్నారని, దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. ఇలాంటి సంక్షోభం సమయంలో ఆయా దేశాల ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులలో ఆందోళనను పెంచుతుందని, ఈ నేపథ్యంలో రిస్క్ అసెట్స్ పైన ఒత్తిడి ఉంటుందని తెలిపింది.

ఆర్బీఐ చేతిలో..

ఆర్బీఐ చేతిలో..

భారత్‌లోను ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ దెబ్బతింటోందని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. కరోనా కేసులు 500కు పైగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రాబోవు నెలల్లో ఆర్బీఐ ద్రవ్య సడలింపు చేస్తుందని భావిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ టూల్ బాక్స్‌లో వివిధ పాలసీలు ఉన్నాయని తెలిపింది. రెపో రేటు, వడ్డీ రేట్లు తగ్గింపు, రిజర్వ్ రిక్వైర్మెంట్ అడ్జస్ట్‌మెంట్ వంటి పలు అంశాలు ఉన్నాయని తెలిపింది.

రెపో రేటు 175 పాయింట్లు తగ్గొచ్చు

రెపో రేటు 175 పాయింట్లు తగ్గొచ్చు

ఆర్బీఐ రెపో రేటును 175 పాయింట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేస్తోంది. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 5.15 నుండి 3.40 శాతానికి వస్తుందని తెలిపింది.

English summary

షాకింగ్: 65% గ్లోబల్ ఎకానమీ లాక్‌డౌన్, ఆర్థిక సంక్షోభం దిశగా..! | 65 percent of the global economy under lockdown, likely to result in a global recession

'We believe that growing area lockdowns across the globe, with around 65 per cent of the global economy under some sort of lockdown or quarantine as of end-March, is likely to result in a global recession,
Story first published: Wednesday, March 25, 2020, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X