For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది చివరి నాటికి 20 నుండి 25 నగరాల్లో 5జీ స్పెక్ట్రం

|

ఈ సంవత్సరం చివరినాటికి దేశంలోని 20 నుండి 25 నగరాల్లో 5G సేవలు ప్రారంభిస్తామని కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఆగస్ట్-సెప్టెంబర్ త్రైమాసికం నాటికి 5జీ సేవలు ప్రారంభమవుతాయని ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన తెలిపారు. ప్రారంభ దశలో 5జీ సేవలు అందించే నగరాల పేర్లను మంత్రి వెల్లడించవలసి ఉంది.

2022 ఏడాదిలోగా తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని గతంలోనే డాట్ వెల్లడించింది. ఈ జాబితాలో ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, లక్నో, అహ్మదాబాద్, గాంధీనగర్, జామ్ నగర్ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఈ జాబితాలో ఉంది. 5జీ వేలం నిర్వహణ కోసం డాట్ చేసిన ప్రతిపాదనకు కేంద్రమంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది.

5G Deployment in 20 to 25 cities of country by year end

సోమవారం 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించిన బిడ్ ముందస్తు సమావేశాన్ని కూడా డాట్ నిర్వహించనుంది. రూ.4.5 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 గిగాహెడ్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం వేలానికి తీసుకు రానుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్ర కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. రూ.4.31 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెడ్జ్స్ స్పెక్ట్రం వేలం జూలై 26 నుండి ప్రారంభం కానుంది. వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రంను కంపెనీలకు ఇరవై ఏళ్ల కాలానికి అప్పగించనున్నారు.

English summary

ఈ ఏడాది చివరి నాటికి 20 నుండి 25 నగరాల్లో 5జీ స్పెక్ట్రం | 5G Deployment in 20 to 25 cities of country by year end

Telecom Minister Ashwini Vaishnaw on Saturday said that 5G services will be deployed across 20-25 cities and towns of the country by the end of the year.
Story first published: Sunday, June 19, 2022, 9:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X