For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Scam: దేశ రాజధానిని కుదిపేస్తున్న క్రిప్టో స్కామ్.. వామ్మో.. వందల కోట్లు గల్లంతు..

|

డబ్బుల కోసం వద్దన్న పనులు చేసేవారు ఉన్నంత వరకూ మోసగాళ్లు రెచ్చిపోతుంటారనేది నిజం. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్టాలు లేదా మోసాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని భారత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలా మందిలో మార్పు రావటం లేదు. ప్రజలను క్రిప్టోలకు దూరం చేసేందుకు అధిక పన్నులు, ఛార్జీలను సైతం అమలు చేస్తోంది.

దిల్లీ ముఠా మోసం..

దిల్లీ ముఠా మోసం..

ఈ క్రమంలో దిల్లీకి చెందిన ఓ ముఠా దాదాపుగా రూ.500 కోట్ల క్రిప్టో మోసానికి పాల్పడి పారిపోయిన వార్త ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. అబద్ధాలతో సామాన్యులను తప్పుదోవ పట్టిస్తూ.. నమ్మకంగా మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.

ఎలా మోసం చేశారంటే..

ఎలా మోసం చేశారంటే..

కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నామంటూ మాయగాళ్లు ప్రజలను నమ్మించారు. ఇలా చాలా మంది నుంచి క్రిప్టో పెట్టుబడులంటూ దాదాపుగా రూ.500 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. పెట్టుబడిపెట్టిన వారికి 200 శాతం రాబడిని అందిస్తామంటూ మాయగాళ్లు వాగ్దానం చేశారు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ నిందితులు దేశాన్ని విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.

 గోవాలో మీటింగ్స్..

గోవాలో మీటింగ్స్..

బడా మోసానికి పాల్పడిన నేరగాళ్లు ఇన్వెస్టర్లను వెకేషన్ కోసం గోవాకు తీసుకెళ్లి ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు, పార్టీలు కూడా నిర్వహించినట్లు వెల్లడైంది. అలా గోవాలో పెద్ద కార్యక్రమాలను సైతం నిర్వహించారని తెలుస్తోంది. అక్కడి సమావేశంలో పెట్టుబడిదారులకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ.. భారీగా రాబడిని అందిస్తామని ప్రజలను నమ్మించారు.

 దుబాయ్ ప్రామిస్..

దుబాయ్ ప్రామిస్..

తమ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే వారి కుటుంబాన్ని సెలవు దినాల్లో దుబాయ్ టూర్ కి తీసుకెళతామని నిందితులు ప్రామిస్ చేశారు. అలా స్కామర్‌లు దుబాయ్‌లో విలాసవంతమైన ఆఫీస్‌ను కూడా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు ఇది ఎంత వరకు నిజం అనేదానిని చెక్ చేయటాన్ని కొంత మంది ఇన్వెస్టర్ల ప్రయత్నించగా వారికి దుబాయ్ తీసుకెళ్లి నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలను మోసగాళ్లు చూపారని తెలిసింది. వాటిని తమ కార్యాలయం కోసమే కడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

 కోటికి పైగా కోల్పోయిన వ్యక్తి..

కోటికి పైగా కోల్పోయిన వ్యక్తి..

ఈ భారీ రూ.500 కోట్ల మోసంలో ఓ వ్యక్తి రూ.1.47 కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము తీసుకొస్తున్న కొత్త క్రిప్టో విలువ ప్రస్తు 2.5 డాలర్లుగా ఉందని.. ప్రపంచ దేశాల్లో ప్రవేశపెట్టగానే రాకెట్ వేగంతో దూసుకెళ్తుందని మోసగాళ్లు నమ్మించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. పెట్టుబడి తేదీని బట్టి నెల 5, 15, 25 తేదీల్లో పెట్టుబడిదారుల బ్యాంకు ఖాతాలో లాభాలు జమ అవుతాయని ఈ మోసగాళ్లు బాధితులకు తెలిపినట్లు వెల్లడైంది.

English summary

Crypto Scam: దేశ రాజధానిని కుదిపేస్తున్న క్రిప్టో స్కామ్.. వామ్మో.. వందల కోట్లు గల్లంతు.. | 500 crores Crypto Scam Busted In Delhi Investors filed case under investigation

500 crores Crypto Scam Busted In Delhi Investors filed case under investigation
Story first published: Friday, December 30, 2022, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X