న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. రోజువారీ కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. కొద్దిరోజులుగా లక్షకు దిగువగా కొత్త కేసులు నమోదవుతోన్నాయి. కంటికి కనిపించని ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌లోకి జారుకున్న పలు రాష్ట్రాలు క్రమంగా వాటికి సడలిస్తోన్నాయి. దశలవారీగా అన్‌లాక్‌ను అమలు చేస్తోన్నాయి. సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌లో కొనసాగడం వల్ల రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో- వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (GST Cuncil) మరోసారి సమావేశమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలో ఈ ఉదయం 11:30 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ ఆరంభమైంది. ఇది 44వ జీఎస్టీ కౌన్సలి సమావేశం (44th GST Council meeting). కిందటి నెల 28వ తేదీన 43వ జీఎస్టీ భేటీ ముగిసిన విషయం తెలిసిందే. అతి కొద్ది సమయంలోనే మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిర్మల సీతారామన్ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు దీనికి హాజరయ్యారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ ఉపకరణాలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లపైనా 12 శాతం జీఎస్టీని విధించింది. ఇక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లపై ఏకంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోన్న స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్‌పైనా జీఎస్టీ విధించింది. అయిదు శాతం జీఎస్టీ (5% GST)ని వసూలు చేస్తోంది. దీనివల్ల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటు 47 రూపాయల మేర పెరిగింది. వాటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా అందిన విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్మల సీతారామన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆమె వెల్లడిస్తారు.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications