కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడిన రంగాల్లో హోటల్ అండ్ రెస్టారెంట్, టూరిజం, విమానయాన రంగాలు ఉన్నాయి. ఈ రంగాలు కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. కరోనా ముందు వ్యాపారాలకు చేరుకోవాలంటే ఆరు నెలల నుండి ఏడు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా హోటల్ అండ్ రెస్టారెంట్ బిజినెస్‌పై ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఎక్కువ హోటల్స్ అండ్ రెస్టారెంట్లు దాదాపు తాత్కాలికంగా మూతబడటంతో పాటు, ఈ రంగం రెండు మూడు నెలల్లో కోలుకోవచ్చునని పేర్కొంది. ఈ మేరకు జొమాటో ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ, మిడ్ కోవిడ్ 19 పేరుతో నివేదిక రూపొందించింది.

గుడ్‌న్యూస్.. 2-3 నెలల్లో కరోనా ముందుస్థాయికి బిజినెస్
హోటల్ అండ్ రెస్టారెంట్ పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా రెస్టారెంట్స్ తమ కార్యకలాపాల్లో వేగంగా మార్పులు చేసుకుంటున్నాయని జొమాటో నివేదిక తెలిపింది. కరోనా ప్రభావం నుండి ఫుడ్ ఇండస్ట్రీ దేశంలో గణనీయంగా వృద్ధి చెందిందని తెలిపింది. పరిశ్రమ బలంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. వచ్చే రెండు మూడు నెలల్లో ప్రీ-కోవిడ్ స్థాయికి రెస్టారెంట్స్ వ్యాపారం చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

రెస్టారెంట్‌కు వెళ్లడం పెరగలేదు
మార్చి 25వ తేదీన లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి దాదాపు ఏడు కోట్ల ఫుడ్ ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు జొమాటో నివేదిక తెలిపింది. ఈ ఫుడ్ డెలివరీ సమయంలో కరోనా ఒక్క కరోనా కేసు వ్యాప్తించలేదని, తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనాకు ముందు ఉన్న రెస్టారెంట్ల సంఖ్యలో 70 శాతం వరకు రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగలేదని తెలిపింది. ప్రస్తుతం 83 శాతం డైనవుట్స్ కార్యకలాపాల్లేవని, 10 శాతం ఇప్పటికే మూతబడ్డాయిని వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడుతున్నందున 43 శాతం తెరుచుకుంటాయని తెలిపింది.

40 శాతం రెస్టారెంట్స్ క్లోజ్
దాదాపు 40 శాతం రెస్టారెంట్లు పర్మినెంట్‌గా క్లోజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని జొమాటో తెలిపింది. ఇప్పటికే 10 శాతం క్లోజ్ అయిన పరిస్థితులు ఉన్నాయని, మరో 30 శాతం ఈ కరోనా కారణంగా మూతబడవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. జొమాటో ఆగస్ట్ 1వ తేదీన 15,000 రెస్టారెంట్లతో సర్వే నిర్వహించింది. ప్రతి నగరంలో 1000 రెస్టారెంట్లను తీసుకుంది. కోల్‌కతాలో ఎక్కువ రెస్టారెంట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, చెన్నైలో తక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 12 శాతం, చెన్నైలో 9 శాతం, కోల్‌కతాలో 29 శాతం ఓపెన్ అయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications