For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3M India: రూ.850 భారీ డివిడెండ్ ప్రకటించిన MNC కంపెనీ..

|

ఓ లార్జ్ క్యాప్ కంపెనీ రూ.850 భారీ డివిడెండ్ ప్రకటించింది. 3M ఇండియా త్రైమాసిక ఫలితాలతో పాటు FY2023 కోసం ఒక్కో షేరుకు రూ. 850 ప్రత్యేక డివిడెండ్‌ను బుధవారం ప్రకటించింది. "నవంబర్ 9, 2022న జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 850/- మధ్యంతర (ప్రత్యేక) డివిడెండ్‌ను బోర్డు ప్రకటించినట్లు కంపెనీ ఒక ఫైలింగ్‌లో తెలిపింది.

డివిడెండ్ రికార్డ్ తేదీ
కంపెనీ డివిడెండ్ రికార్డ్ తేదీని కూడా ప్రకటించింది. నవంబర్ 22 డివిడెండ్ రికార్డ్ తేదీగా తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ డిసెంబర్ 9, 2022 నాటికి లేదా అంతకంటే ముందు చెల్లించనుంది. ఈ MNC స్టాక్ గత ఏడాదిలో 14 శాతం పడిపోయింది. ఫలితాలు, డివిడెండ్ ప్రకటన తర్వాత, ఈ స్టాక్ దాదాపు 5% లాభంతో ఒక్కో షేరుకు రూ.23,484 వద్ద ముగిసింది.

 3M India: రూ.850 భారీ డివిడెండ్ ప్రకటించిన MNC కంపెనీ..

భారీగా పెరిగిన స్టాక్
3M ఇండియా కంపెనీ పారిశ్రామిక, ప్యాకేజింగ్, ఆరోగ్య సంరక్షణ, భద్రత, గ్రాఫిక్స్ రంగాలలో పనిచేసే సాంకేతిక సంస్థగా పేరు పొందింది. ఈ రూ.850 డివిడెండ్ పొందాలనుకునే వారు నవంబర్ 22 వరకు ఈ స్టాక్ తమ డీమ్యాట్ అకౌంట్ల్ క్రెడిట్ చేసుకోవాలి. బుధవారం భారీగా పెరిగిన ఈ స్టాక్ గురువారం స్వల్పంగా పడిపోయింది.

Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిపుణులను సంప్రదించగలరు.

English summary

3M India: రూ.850 భారీ డివిడెండ్ ప్రకటించిన MNC కంపెనీ.. | 3M India Company has announced a huge dividend of Rs.850

3M India with quarterly results for FY2023 at Rs. 850 as a special dividend on Wednesday.
Story first published: Thursday, November 10, 2022, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X