For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాలు పోయి, తిరిగివచ్చిన ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఆ రాష్ట్రంలో గుడ్‌న్యూస్!

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం పడింది. అంతోఇంతో తక్కువ ప్రభావం పడింది దాదాపు ఈ రంగం పైనే. అయినప్పటికీ చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఊరట కల్పించింది. కర్మోభూమి పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించింది. ఈ పథకం కింద ఉపాధి కోసం 37వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖమంత్రి అమిత్ తెలిపారు.

ఉద్యోగాల కోత, జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోం ఇబ్బందులు...: ఐటీ సంస్థలపై సర్వేఉద్యోగాల కోత, జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోం ఇబ్బందులు...: ఐటీ సంస్థలపై సర్వే

టీసీఎస్‌‍కు 20 ఎకరాలు

టీసీఎస్‌‍కు 20 ఎకరాలు

బెంగాల్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సిలిగిరి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో 17 ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ద్వితీయ, తృతీయ నగరాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని సీఐఐ(కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)ను కోరామన్నారు. సిలికాన్ వ్యాలీలో 20 ఎకరాల భూమిని భారతీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కేటాయించామన్నారు. టీసీఎస్ కార్యాలయ ఏర్పాటుతో బెంగాల్‌లో చాలామంది ఆశావహులకు ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.

మరో ఐదు ఐటీ పార్కులు

మరో ఐదు ఐటీ పార్కులు

కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారికి సహకరించేందుకు కర్మోభూమి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు అమిత్. ఇది స్కిల్డ్ ఉద్యోగుల వేదిక అన్నారు. జూన్ 8వ తేదీన దీనిని ప్రారంభించగా, 37,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 24వేల దరఖాస్తులు ప్రాసెస్ అయినట్లు తెలిపారు. చిన్న పట్టణాలు, నగరాలు గతంలో నిర్లక్ష్యం చేయబడ్డాయని, కాబట్టి సిలిగురి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి మరో ఐదు ఐటీ పార్కులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు తెలిపారు.

టీసీఎస్, రిలయన్స్‌తో వేలాది ఉద్యోగాలు

టీసీఎస్, రిలయన్స్‌తో వేలాది ఉద్యోగాలు

టీసీఎస్‌కు సిలికాన్ వ్యాలీలో భూమితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 40 ఎకరాలను తీసుకున్నట్లు తెలిపారు. రిలయన్స్ జియో డేటా సెంటర్ కోసం దీనిని తీసుకున్నట్లు తెలిపారు. టీసీఎస్ బెంగాల్‌లో కొత్తగా 15000 ఉద్యోగాలను సృష్టించనుందని అమిత్ మిత్ర తెలిపారు. దేశంలో ఉద్యోగాల కల్పన విషయంలో ఇది టీసీఎస్ యొక్క అతిపెద్ద కేంద్రంగా ఉండనుందని చెప్పారు. మరో ఐటీ దిగ్గజం రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.

English summary

ఉద్యోగాలు పోయి, తిరిగివచ్చిన ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఆ రాష్ట్రంలో గుడ్‌న్యూస్! | 3,000 IT professionals, get jobs under special scheme in West Bengal

At least 3,000 information technology (IT) professionals, who have returned to West Bengal from the other parts of the country during coronavirus pandemic, have been offered jobs, West Bengal finance minister Amit Mitra said.
Story first published: Wednesday, September 23, 2020, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X