For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vivo: అడ్డంగా దొరికిపోయిన చైనా కంపెనీ వివో.. 27 వేల ఫోన్లు పట్టుకున్న అధికారులు..!

|

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు కేంద్ర అధికారులు షాకిచ్చారు. భారత్ లో తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లను విదేశాలకు తరలించే ప్రయత‍్నం చేస్తుండగా కేంద్ర అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్లు అడ్డుకున్నారు. Vivo కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కో ఇండియా యూనిట్ లో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లను విలువను తప్పుగా ప్రకటించి ఎగుమతి చేసే ప్రయత్నం చేశారు.

రెవెన్యూ ఇంటెలిజెన్స్

రెవెన్యూ ఇంటెలిజెన్స్

ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందడంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లతో పాటు నిందితులను పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు $15 మిలియన్లు ఉంటాయని తెలిసింది. ఈ ఘటనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, వివో ఇండియా స్పందించలేదు.

పంకజ్ మొహింద్రూ

పంకజ్ మొహింద్రూ

వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. "ఈ దురదృష్టకర చర్యను ఆపడానికి తక్షణ జోక్యాన్ని మేము అభ్యర్థిస్తున్నాము" అని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2 నాడు టెక్ మంత్రిత్వ శాఖలోని టాప్ బ్యూరోక్రాట్‌కు లేఖ రాశారు అని" బ్లూమ్‌బెర్గ్ కథనం వచ్చింది.

ఉద్రిక్తతలు

ఉద్రిక్తతలు

2020 వేసవిలో సరిహద్దు వద్ద దేశాలు ఘర్షణ పడిన తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. SAIC మోటార్ కార్ప్ లిమిటెడ్ MG మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు Xiaomi Corp స్థానిక యూనిట్లతో సహా భారతదేశంలో పనిచేస్తున్న చైనా కంపెనీలపై కేంద్రం నిఘా పెంచింది. చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

44 ప్రాంతాల్లో దాడులు

44 ప్రాంతాల్లో దాడులు

దీంతో ఈఏడాది జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో వివో మోసాలను ఈడీ గుర్తించింది. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వివో ఫోన్‌లను ఇతర దేశాలకు తరలించడం గమనార్హం. Vivo తన మొదటి బ్యాచ్ ఇండియా-మేడ్ స్మార్ట్‌ఫోన్‌లను నవంబర్ ప్రారంభంలో సౌదీ అరేబియా, థాయిలాండ్ వంటి మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. అయితే తాజా స్నాగ్ ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo భవిష్యత్తును ప్రశ్నర్థకం చేసింది.

English summary

Vivo: అడ్డంగా దొరికిపోయిన చైనా కంపెనీ వివో.. 27 వేల ఫోన్లు పట్టుకున్న అధికారులు..! | 27 thousand Vivo mobiles made in India were caught by the authorities while they were being exported

Chinese smartphone maker Vivo has been shocked by central authorities. While trying to move smart phones made in India to foreign countries, central officials worked for a week and intercepted around 27 thousand phones.
Story first published: Wednesday, December 7, 2022, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X