For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని రాష్ట్రాలు..

|

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్‌ను కొంతమేర తగ్గించాయని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ మూడున ఇంధన సెస్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా సామాన్యులపై భారం తగ్గించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రం ధరలు తగ్గించలేదని తెలిపింది. అయితే ఇతర రాష్ట్రాల వలే తాము వ్యాట్ తగ్గిస్తామని రాజస్థాన్ తెలిపింది.

ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం(నవంబర్ 13) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ధరలు తాము తగ్గించేది లేదని చెబుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది.

25 states, UTs so far slashed VAT on petrol, diesel

మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103.97, లీటర్ డీజిల్ ధర 86.67, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14, చెన్నైలో పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43, కోల్‌కతాలో పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79, భోపాల్‌లో పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40, హైదరాబాద్‌లో డీజిల్ రూ.94.62, లీటర్ పెట్రోల్ రూ.108.20గా ఉంది. అయితే ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర ప్రదేశ్, గోవా, కర్నాటక దారిలో పంజాబ్ నడిచింది. ఇక్కడ పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.5 తగ్గించింది. ఢిల్లీతో పోలిస్తే పంజాబ్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర రూ.9 తక్కువ. పంజాబ్‌లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ రూ.95.63, లీటర్ డీజిల్ రూ.84.42గా ఉంది.

25 states, UTs so far slashed VAT on petrol, diesel

యూఎస్ ఇన్వెంటరీ రిపోర్ట్ అనంతరం అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త శాంతించాయి. బ్రెంట్ క్రూడ్ ధర 69 సెంట్లు తగ్గి 84.09 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్ 1.24 డాలర్లు లేదా 1.5 శాతం క్షీణించి 82.91 డాలర్లకు తగ్గింది.

దేశీయ అవసరాల్లో భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదని గుర్తు చేశారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్-సరఫరాకు అనుగుణంగా ధరలు మారుతుంటాయని చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభం కారణమన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ధరలు ప్రభుత్వాల చేతిలో ఉండకపోవడానికి ఓ కారణమన్నారు. కేవలం పునరుత్పాదక, హరితఇంధనంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి, 2023 నాటికి లీటర్ ముడి చమురు మరో రూ.100 పెరగవచ్చునని అంటున్నారు.

25 states, UTs so far slashed VAT on petrol, diesel

దీపావళి సమయంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. పలు రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి.

కాగా అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ.7 తగ్గించాయి. ఉత్తర ప్రదేశ్ ఏకంగా రూ.12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రూ.2 తగ్గించింది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత చౌకగా అందుబాటులోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి.

English summary

Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని రాష్ట్రాలు.. | 25 states, UTs so far slashed VAT on petrol, diesel

The states and UTs which have not undertaken any cut in VAT in petrol and diesel are: Maharashtra, NCT of Delhi, West Bengal, Tamil Nadu, Telangana, Andhra Pradesh, Kerala, Jharkhand, Chattisgarh and Rajasthan.
Story first published: Saturday, November 13, 2021, 8:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X