భారతదేశంలో యూనీకార్న్ హోదా పొందిన స్టార్టప్స్ 21 ఉన్నట్లు హూరున్ గ్లోబల్ యూనికార్న్ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్ రంగంలో బిలియన్ డాలర్ల విలువ (రూ.7,500 కోట్లు) చేసే కంపెనీని యూనీకార్న్‌గా పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక యూనీకార్న్స్ ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో బ్రిటన్ ఉన్నాయి.

యూనీకార్న్స్ వ్యాల్యూ 73.2 బిలియన్ డాలర్లు
మన దేశంలోని 21 యూనీకార్న్స్ మొత్తం వ్యాల్యూ 73.2 బిలియన్ డాలర్లుగా హూరున్ గ్లోబల్ యూనీకార్న్ జాబితా వెల్లడించింది. వీటిలో 11 సంస్థల్లో చైనాకు చెందిన ముగ్గురు ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో అలీబాబా 5, టెన్సెంట్ 3, డీఎస్టీ గ్లోబల్ మూడింట చొప్పున పెట్టుబడులు పెట్టాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు అత్యధికంగా 9 ఇండియన్ యూనికార్న్‌లలో ఇన్వెస్ట్ చేసింది. అమెరికా ఆధారిత టైగర్ గ్లోబల్ ఐదింటిలో ఇన్వెస్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ యూనీకార్న్‌లు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థాపించిన యూనీకార్న్స్ వ్యాల్యూ 99.6 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. భారత సంతతికి చెందినవారు బిలియన్ డాలర్లకు పైగా విలువైన 40కి పైగా స్టార్టప్స్ కలిగి ఉన్నారు. వీటి వ్యాల్యూ 99.6 బిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లోని 145 నగరాల్లో 586 యూనీకార్న్‌లు ఉన్నట్లు హూరున్ తెలిపింది. ప్రపంచ్వయాప్తంగా భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులకు చెందిన యూనీకార్న్‌లో 61 ఉండగా, వీటి వ్యాల్యూ 9,960 కోట్ల డాలర్లు. ఇందులో రాబిన్ హుడ్ అనే ఫిన్ టెక్ కంపెనీ వ్యాల్యూ 850 కోట్ల డాలర్లు. భారతీయుల యూనికార్న్‌లు మూడింట రెండొంతులు విదేశాల్లో ఉండగా, అందులోను అమెరికా, సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్నవి ఎక్కువ.

చైనాతో పోలిస్తే 10 శాతం కంటే తక్కువ
చైనాతో పోలిస్తే మన దేశంలో యూనికార్న్‌ల సంఖ్య పదో వంతు కంటే తక్కువ. చైనాలో 227 స్టార్టప్స్ యూనీకార్న్ హోదాను దక్కించుకున్నాయి. భారత సంతతి వ్యక్తులు విదేశాల్లో 40 యూనీకార్న్‌లు స్థాపించగా చైనా సంతతివారు విదేశాల్లో స్థాపించిన స్టార్టప్స్‌లలో యూనీకార్న్‌లుగా ఎదిగినవి కేవలం 16.
అమెరికాలో 233, చైనాలో 227, బ్రిటన్‌లో 24, ఇండియాలో 21, సౌత్ కొరియాలో 11, జర్మనీలో 10 యూనీకార్న్‌లు ఉన్నాయి.

బెంగళూరు భారత యూనికార్న్ రాజధాని
మన దేశంలో బెంగళూరులోనే ఎక్కువ యూనీకార్న్‌లు ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి. యూనీకార్న్ వ్యవస్థాపకుల్లో ఎక్కువగా ఐఐటీ విద్యార్థులు ఉన్నారు. ఇందులోను ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న వారు 36 మంది ఉన్నారు. ఇందులో 104 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మన దేశంలో ఉన్న యూనీకార్న్‌లలో పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్, ఉడాన్, స్విగ్గీ వంటివి ఉన్నాయి. మన దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ పేటీఎం. దీని ప్రస్తుత వ్యాల్యూ 16 బిలియన్ డాలర్లు. యంగెస్ట్ యూనికార్న్ 2017లో ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్.

టాప్ 10 కంపెనీల వ్యాల్యూ
మన దేశంలో స్టార్టప్స్ యూనికార్న్‌గా ఎదిగేందుకు సగటున 7 సంవత్సరాలు పడుతుంది. చైనాలో 5.5 ఏళ్లు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతుంది. పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్, స్విగ్గీ, జొమాటో, పేటీఎం మాల్, రెన్యూ పవర్, జెరోధా, బిగ్ బాస్కెట్, ఉడాన్, బిల్ డెస్క్, డెలివరీ, మ్యూ సిగ్మా, లెన్స్ కార్ట్, పాలసీ బజార్, ఫస్ట్ క్రై, డ్రీమ్ 11, హైక్, ఓలా ఎలక్ట్రిక్, రివిగో మన యూనికార్న్‌లు.
టాప్ 10 యూనికార్న్‌లు. వాటి వ్యాల్యూ... రంగం..
Paytm - 16 బిలియన్ డాలర్లు.. FinTech
OYO Rooms - 8 బిలియన్ డాలర్లు.. E-commerce
BYJU's - 8 బిలియన్ డాలర్లు.. EdTech
Ola Cabs - 6 బిలియన్ డాలర్లు.. Shared Economy
Swiggy - 3.5 బిలియన్ డాలర్లు.. On-Demand Delivery
Zomato - 3.5 బిలియన్ డాలర్లు.. On-Demand Delivery
Paytm Mall - 3 బిలియన్ డాలర్లు.. E-commerce
ReNew Power - 3 బిలియన్ డాలర్లు.. New Energy
BigBasket - 2.5 బిలియన్ డాలర్లు.. E-commerce
Udaan - 2.5 బిలియన్ డాలర్లు.. E-commerce
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications