For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవీకే గ్రూప్ భారీగా నిధుల సమీకరణ.. ఎందుకోసమంటే?

|

హైదరాబాద్ కేంద్రంగా విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీవీకే గ్రూప్ భారీ మొత్తంలో నిధులు సమీకరించనుంది. 7,614 కోట్ల రూపాయల నిధులు సమీకరించడానికి గాను జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన ఎయిర్పోర్ట్ కంపెనీలైన జీవీకే ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ (జీవీకేఏడీఎల్), జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ (జీవీకే ఏ హెచ్ ఎల్) లు అబుదాబి ఇన్వెస్టుమెంట్ అథారిటీ, కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లతో ఒప్పందాలు చేసుకుంది.

తప్పదనుకుంటేనే పర్సనల్ లోన్: లేకుంటే అంతే సంగతితప్పదనుకుంటేనే పర్సనల్ లోన్: లేకుంటే అంతే సంగతి

ఎందుకీ నిధులు ?
ఇంత భారీ స్థాయిలో జీవీకే నిధులు సమీకరించడం వెనుక పలు రకాల కారణాలున్నాయి. ఈ నిధుల ద్వారా తన హోల్డింగ్ కంపెనీల కు సంభందించిన అప్పులను తీర్చాలనుకుంటోంది. అంతే కాకుండా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎం ఐ ఏ ఎల్ ) లో అదనంగా వాటాలు కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ కంపెనీలో జీవీకే తో పాటు బిడ్ వెస్ట్ , ఏసిఎస్ఏ లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

GVK Group to raise Rs 7,614 crore to retire debt

పెట్టుబడులకు ప్రతిగా వాటా

* ఈ కంపెనీల నుంచి పొందే పెట్టుబడులకు గాను ఆయా కంపెనీలు వాటాను పొందనున్నాయి. పెట్టుబడులు పొందిన తర్వాత జీవీకే ఏ హెచ్ ఎల్ లో జీవీకే ఏ డీ ఎల్ కు 20.9 శాతం వాటా ఉంటుంది. మిగితా వాటా ఈ ఇన్వెస్టర్లకు వాటా సమానంగా ఉంటుంది.

* ఎమ్ ఐ ఏ ఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ ల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా జీవీకే రెడ్డి కొనసాగనున్నారు. ఈయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డి ఈ రెండు కంపెనీల కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటారు.

ఆదానీతో వివాదం..

* ప్రయాణికుల రాకపోకలు ఏక్కువగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ రెండో స్థానంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ను నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎం ఐ ఏ ఎల్ ) లో వాటా విక్రయానికి సంబంధించి అదానీ గ్రూప్ తో జీవీకే గ్రూప్ పోరాటం చేస్తోంది,

* దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్ వెస్ట్ కు ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న13.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీన్ని జీవీకే ఎదురిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం బొంబాయి హై కోర్టు లో ఉంది.

* జీవీకే సారథ్యంలోని కన్సార్షియం.. బిడ్ వెస్ట్, ఎయిర్పోర్ట్ కంపెనీ అఫ్ సౌత్ ఆఫ్రికా, ప్రభుత్వ రంగంలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు జాయింట్ వెంచర్ గా ఎం ఐ ఏ ఎల్ ను ఏర్పాటు చేశాయి. ఇందులో జీవీకే హోల్డింగ్స్ కు మెజారిటీ వాటా 50.5 శాతం, ఏ ఏ ఐ కి 26 శాతం వాటా ఉంది. విదేశీ కంపెనీలైన బిడ్ వెస్ట్ వాటా 13.5 శాతం, ఏ సి ఎస్ ఏ గ్లోబల్ (ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ) వాటా 10 శాతం గా ఉంది.

English summary

జీవీకే గ్రూప్ భారీగా నిధుల సమీకరణ.. ఎందుకోసమంటే? | GVK Group to raise Rs 7,614 crore to retire debt

The airport arms of GVK Power and Infrastructure Lmited (GVK Group) has signed agreements to raise an investment of ₹7,614 from Abu Dhabi Investment Authority (ADIA), Canada's Public Sector Pension Investment Board, (PSP Investments), and the government-backed National Investment & Infrastructure Fund (NIIF), the company said in a statement on Sunday.
Story first published: Monday, October 28, 2019, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X