For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి 2019: సాయంత్రం గం.6.15కు ముహూరత్ ట్రేడింగ్

|

ముంబై: దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆదివారం ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లలో ఈ రోజు సాయంత్రం గం.6.15 నిమిషాల నుంచి రాత్రి గం.7.15 నిమిషాల వరకు గంట పాటు ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. తద్వారా సంవత్ 2076 (కొత్త సంవత్సరం)కు నాంది పలకనున్నారు. సోమవారం మార్కెట్లకు సెలవు. కాగా మంగళవారం యథాతథంగా ప్రారంభమవుతాయి. 2075లో సెన్సెక్స్ 4,306 పాయింట్లు, నిఫ్టీ 1,131 పాయింట్లు పుంజుకుంది.

ఇదిలా ఉండగా, సెన్సెక్స్‌లోని టాప్ 10 సంస్థల్లో ఏడు కంపెనీల మార్కెట్ వ్యాల్యూ గత వారం రూ.76,998.4 కోట్లు పెరిగింది. ఐటీ రంగ దిగ్గజం TCS ఇన్వెస్టర్ల సంపద రూ.25,403 కోట్లు పెరిగి రూ.7,97,400.51 కోట్లను తాకింది. ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ రూ.20,271.2 కోట్లు పెరిగి రూ.3,03,054.59 కోట్లకు పెరిగింది. SBI మార్కెట్ వ్యాల్యూ రూ.10,664.91 కోట్లు పెరిగి రూ.2,51,317.06 కోట్లకు చేరుకుంది.

Diwali 2019: Mahurat trading to start at 6:15 pm on October 27

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.9,762.29 కోట్లు పెరిగి రూ.9,06,941.76 కోట్లుకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.7,934.03 కోట్లు పెరిగి రూ.4,63,886.75 కోట్లకు, ITC రూ.1,658.68 కోట్లు పెరిగి రూ.3,04,520 కోట్లకు, HDFC లిమిటెడ్ రూ. 1,303.65 కోట్లు అందుకుని రూ.3,63,105.62 కోట్లకు చేరుకుంది.

ఇన్ఫోసిస్‌లో ప్రకంపనల నేపథ్యంలో షేర్ల వ్యాల్యూ పడిపోయింది. ఇన్ఫీ మార్కెట్ వ్యాల్యూ రూ.55,921.5 కోట్లు పడిపోయి రూ.2,73,830.43 కోట్లకు తగ్గింది. కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.5,262.13 కోట్లు పడిపోయి రూ.3,03,293.39 కోట్లకు, HDFC బ్యాంకు రూ.273.54 కోట్లు తగ్గి రూ.6,72,192.76 కోట్లకు తగ్గాయి. సెన్సెక్స్ టాప్ 10 సంస్థల్లో రిలయన్స్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి.

English summary

దీపావళి 2019: సాయంత్రం గం.6.15కు ముహూరత్ ట్రేడింగ్ | Diwali 2019: Mahurat trading to start at 6:15 pm on October 27

On account of the Laxmi Pujan that takes place in the festival of Diwali, the BSE and National Stock Exchange (NSE) will be open for one hour of trading on October 27.
Story first published: Sunday, October 27, 2019, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X