For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడిపోయిన జెఫ్ బెజోస్ ర్యాంక్.. ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్ గేట్స్!

|

ప్రపంచ కుబేరుడిగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ అవతరించారు. ఈ పీఠాన్ని 24 ఏళ్లపాటు ఏలుతూ వచ్చిన బిల్ గేట్స్ గత ఏడాది ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు. అమెజాన్ ఇన్‌కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ 2018లో బిల్ గేట్స్‌ను తోసిరాజంటూ 160 బిలియన్ డాలర్ల సంపదతో నంబర్ వన్ స్థానానికి వచ్చారు.

కానీ జెఫ్ బెజోస్ ఒక్క ఏడాదే ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగారు. తాజాగా అమెజాన్ ఇన్‌కార్పొరేషన్ షేర్లు క్షీణించడంతో ఆయన సంపద కూడా తగ్గింది. దీంతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.

1987లో తొలిసారిగా...

1987లో తొలిసారిగా...

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1987లో తొలిసారిగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నంబర్ వన్ స్థానం పొందారు. అప్పుడు ఆయన సంపద విలువ 1.25 బిలియన్ డాలర్లు. అప్పట్నించి 24 ఏళ్లపాటు ఆ పీఠాన్ని ఏటా ఆయనే దక్కించుకుంటూ వచ్చారు. కానీ 2018లో అమెజాన్ ఇన్‌కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ బిల్ గేట్స్‌కు ఈ రేసులో చెక్ పెట్టారు.

తొలిసారిగా జెఫ్ బెజోస్...

తొలిసారిగా జెఫ్ బెజోస్...

అమెజాన్ ఇన్‌కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ 1998లో తొలిసారిగా ఫోర్బ్స్ 400 రిచెస్ట్ అమెరికన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అప్పటికి ఒక్క ఏడాది ముందే అంటే.. 1997లో అమెజాన్ ఐపీవోకు వచ్చింది. ఆ తరువాత ఏడాదికే బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. అప్పట్లో ఆయన సంపద 1.6 బిలయన్ డాలర్లు.

పడిపోయిన అమెజాన్ షేర్లు...

పడిపోయిన అమెజాన్ షేర్లు...

అమెజాన్ ఇన్‌కార్పొరేషన్ ఈ ఏడాది మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన విధంగా రాలేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో అమెజాన్ షేర్లు క్షీణించాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే ఈ కంపెనీ షేర్లు 9 శాతం మేర పడిపోవడంతో ఒక్కో షేరు ధర 1,624 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అమెజాన్ నికర ఆదాయం ఈ మూడో త్రైమాసికంలో 26 శాతం తగ్గిపోయింది. 2017 తరువాత అమెజాన్ లాభాలు పడిపోవడం ఇదే మొదటిసారి.

నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి...

నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి...

160 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో ప్రపంచ కుబేరుడి కిరీటాన్ని దక్కించుకున్న అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన సంపద 103.9 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఇక రెండో స్థానంలో కొనసాగుతున్న బిల్‌గేట్స్ కూడా ఈ జూలైలో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడంతో నంబర్ 3 స్థానానికి పడిపోయారు. కానీ ఏడాది కాలం తరువాత తిరిగి తన నంబర్ వన్ స్థానాన్ని బిల్ గేట్స్ దక్కించుకోగలిగారు. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద 105.7 బిలియన్ డాలర్లు.

English summary

పడిపోయిన జెఫ్ బెజోస్ ర్యాంక్.. ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బిల్ గేట్స్! | Bill Gates reclaims the world's richest man title

Amazon founder and CEO Jeff Bezos has lost the title as the world's richest man, paving the way for tenacious Bill Gates to grab the top spot after Amazon's lacklustre Q3 results resulted in Bezos losing nearly $7 billion in stock value.
Story first published: Saturday, October 26, 2019, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X