For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI అదుర్స్: 3 రెట్లు పెరిగిన నికర లాభం, దూసుకెళ్లిన షేర్లు

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండో క్వార్టర్‌లో భారీ లాభాలు నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో ఏకీకృత నికర లాభం రూ.3,375.40 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.576.46 కోట్లు నమోదుతో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు కావడం గమనార్హం. స్టాండ్ లోన్ ప్రాతిపదికన చూస్తే మూడు రెట్ల నికర లాభం పెరిగింది. గత ఏడాది జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.944.87 లాభం నమోదు చేయగా, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.3011.87 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్రైల్లో ప్రయాణిస్తున్నారా?: ఏ రకమైన సాయానికి ఏ నెంబర్

సమీక్షా త్రైమాసికంలో ఎస్బీఐ గ్రూప్ రూ.89,347.91 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.79,302.72 కోట్లుగా ఉంది. ఎన్పీఏలు కూడా తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంలో 9.95శాతం ఉండగా, ఇప్పుడు 7.19 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి తగ్గాయి. క్వార్టర్లీ ప్రాతిపదికన తాజా స్లిప్పేజెస్ రూ.16,000 కోట్ల నుంచి రూ.8,800కు తగ్గాయి.

SBI Q2 profit zooms 3-fold to Rs 3,012 crore on one time gain

ఎస్బీఐ నికర వడ్డీ రేటు (NII) ఈ క్వార్టర్లో రూ.24,600 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.20,906 కోట్లుగా నమోదయింది. పెరుగుదల 17.67 శాతంగా ఉంది. ఎస్బీఐ ఆపరేటింగ్ ప్రాఫిట్ 31 శాతం పెరుగుదలతో రూ.13,905 నుంచి రూ.18,199కు పెరిగింది. డొమెస్టిక్ క్రెడిట్ గ్రోత్ 8.43 శాతం పెరిగింది.

SBI భారీ లాభాల నేపథ్యంలో శుక్రవారం (అక్టోబర్ 25) షేర్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి ఓ దశలో షేర్ విలువ 8 శాతానికి కూడా పెరిగింది. మధ్యాహ్నం గం.3.30 సమయానికి 19.85 (7.56%) పెరిగి 282.35 వద్ద ట్రేడ్ అయింది.

English summary

SBI అదుర్స్: 3 రెట్లు పెరిగిన నికర లాభం, దూసుకెళ్లిన షేర్లు | SBI Q2 profit zooms 3-fold to Rs 3,012 crore on one time gain

Public sector State Bank of India on Friday posted a 218 per cent jump in standalone net profit for the September quarter to Rs 3,011.73 crore. The lender had posted a profit of Rs 944.87 crore in the same quarter last year.
Story first published: Friday, October 25, 2019, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X