For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందగమనం ఎఫెక్ట్, 39 శాతం తగ్గిన మారుతీ లాభం

|

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ క్వార్టర్ 2 లాభం ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. జూలై - సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 39.35 శాతం తగ్గి రూ.1,358.60 కోట్లకు పడిపోయింది. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,240.4 కోట్ల లాభాన్ని గడించింది. 2011-12 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మారుతీ సుజుకీ లాభం 56 శాతం క్షీణతతో రూ.241 కోట్లు పడిపోయింది. ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.950 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, అంతకు రెండు రెట్లకు పైగా ఉంది.

ఇయర్ టు ఇయర్ కంపెనీ నెట్ సేల్స్ 22.50 శాతం తగ్గి రూ.16,120 వద్ద ఉన్నాయి. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 21 వేల కోట్లకు పైగా ఉంది. సేల్స్ వ్యాల్యూమ్ 30.2 శాతం తగ్గిపోయాయి. ఆపరేటింగ్ EBIT 74.9 శాతం పడిపోయి రూ.680 కోట్లుగా ఉంది.

దీపావళి గిఫ్ట్: SBI ఉద్యోగులకు రూ.25.7 కోట్ల స్వీట్స్దీపావళి గిఫ్ట్: SBI ఉద్యోగులకు రూ.25.7 కోట్ల స్వీట్స్

Maruti Suzuki posts 39% YoY fall in Q2 profit at Rs 1,359 crore; still beats Street estimates

సేల్స్ వ్యాల్యూమ్ 30.2 శాతం తగ్గి 338,317 యూనిట్లు (వెహికిల్స్) అమ్ముడుపోయాయి. నెట్ సేల్స్ 25.2 శాతం తగ్గిపోయి 161,204 మిలియన్లుగా ఉంది. ఆపరేటింగ్ ఎబిట్ 74.09 తగ్గి 6,802 మిలినయ్లుగా, పీబీడీ 51 శాతం తగ్గి 15,720 మిలియన్లు, ప్యాట్ 39.4 శాతం తగ్గి 13,586 మిలియన్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాంద్యంతో పాటు భారత్‌లోను స్లోడౌన్ కారణంగా ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.

చిన్న కార్ల విక్రయాలు భారీగా తగ్గిన కారణంగా సెప్టెంబర్ చివరినాటికి ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ సుజుకీ మార్కెట్‌ వాటా 60 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలానికి వాటా 65 శాతంగా ఉంది. బీఎస్ 6 నిబంధనలు రానుండటం, వాహన బీమా ఖర్చులు పెరగడం, అనేక రాష్ట్రాల్లో రహదారుల పన్ను పెంపు వంటి వివిధ కారణాల వల్ల సేల్స్ తగ్గాయని కంపెనీ పేర్కొంది.

English summary

మందగమనం ఎఫెక్ట్, 39 శాతం తగ్గిన మారుతీ లాభం | Maruti Suzuki posts 39% YoY fall in Q2 profit at Rs 1,359 crore; still beats Street estimates

Maruti Suzuki on Thursday posted 39.35 per cent year-on-year (YoY) decline in net profit at Rs 1,358.60 crore for the quarter ended September 2019. It had posted a net profit of Rs 2,240.4 crore in the corresponding quarter last year.
Story first published: Friday, October 25, 2019, 13:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X