For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL టెక్ డబుల్ బొనాంజా: బోనస్ షేర్ 1:1, మధ్యంతర డివిడెండ్ 100%

|

HCL టెక్నాలజీస్ తమ వాటాదార్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 (100 శాతం) డివిడెండుగా చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. కంపెనీ ఏకీకృత లాభం 6.9 శాతం పెరిగి రూ.2,711 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.2,534 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది నమోదైన రూ.14,860 కోట్ల నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ.17,527 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ వృద్ధి అంచనాలను 15 శాతం నుంచి 17 శాతం పెరగవచ్చునని అంచనా.

భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు లోబడి విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో కంపెనీ బోనస్ (1:1) షేరును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు సంస్థ రూ.2 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. వీటితోపాటు ప్రతి ఒక్క షేరుకు మరో షేరును ఉచితంగా కేటాయించనుంది. ఈ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించిన వెంటనే కేటాయించనున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది.

మోడీ అదుర్స్: రోజుకు రూ.1 కంటే తక్కువ.. రూ.2 లక్షల ప్రయోజనంమోడీ అదుర్స్: రోజుకు రూ.1 కంటే తక్కువ.. రూ.2 లక్షల ప్రయోజనం

HCL Tech Q2 net profit up 6.9% to ₹2,711 crore, announces bonus shares

దేశీయ ఐటీ రంగ సంస్థలు నమోదు చేసుకుంటున్న 14% సరాసరి వృద్ధి కంటే సంస్థ 20.5% వృద్ధిని నమోదు చేసుకుందని, గడిచిన 6 నెలలుగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయని, ముఖ్యంగా ఎబిటా 20% పెరుగుదల కనిపించిందని HCL టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో విజయ కుమార్ తెలిపారు.

డాలర్ రూపంలో కంపెనీ నికర లాభం 5.5% పెరిగి 376.2 మిలియన్ డాలర్లకు చేరుకుందని, ఆదాయంలో 18% ఎగబాకి 2.48 బిలియన్ డాలర్లు నమోదయినట్లు తెలిపారు. గత త్రైమాసికంలో మొత్తంగా 13,430 మంది సిబ్బంది కొత్తగా చేరగా, వీరిలో నికరంగా 3,223 చేరారు. దీంతో కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,47,123కి చేరుకుంది. 16.9 శాతం వలసలు ఉన్నాయి.

English summary

HCL టెక్ డబుల్ బొనాంజా: బోనస్ షేర్ 1:1, మధ్యంతర డివిడెండ్ 100% | HCL Tech Q2 net profit up 6.9% to ₹2,711 crore, announces bonus shares

IT major HCL Technologies on Wednesday posted a 6.9 per cent rise in its consolidated net profit to ₹2,711 crore for the September 2019 quarter, and raised its revenue growth forecast to 17 per cent for 2019-20.
Story first published: Thursday, October 24, 2019, 8:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X