For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో అదిరిపోయే 'ఆల్ ఇన్ వన్' స్కీం: ఎయిర్‌టెల్, ఐడియాతో పోలిస్తే..

|

న్యూఢిల్లీ: ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల IUC ఛార్జ్ చేస్తున్న రిలయన్స్ జియో తాజాగా ఆల్ ఇన్ వన్ పేరుతో డేటా, ఐయూసీ నిమిషాలు కలిగిన కొత్త ప్లాన్‌ను తీసుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. IUC నిమిషాలు మించితే మళ్లీ నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాలి. ఇందుకు రూ.10 టాపప్ ప్లాన్ వేసుకోవచ్చు. IUC విధింపుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జియో సవరించి, కొత్త టారిఫ్ ప్యాకేజీని ప్రకటించింది.

ఆ ఛార్జీల్లేవు: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్ఆ ఛార్జీల్లేవు: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్

జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్

జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్

జియో దీనిని ఆల్ ఇన్ వన్‌గా వ్యవహరిస్తోంది. ఒకే ప్లాన్‌తో అపరిమిత సేవలతో పాటు రూ.222, రూ.333, రూ.444తో రోజుకు 2GB డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. అపరిమితమైన వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, యాప్స్‌తో రోజుకు 2GB డాటా లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్లాన్స్ కంటే 20% నుంచి 50% తక్కువకు లభిస్తోంది.

రూ.80 ధరను కలుపుకొని ప్యాక్ పెంపు

రూ.80 ధరను కలుపుకొని ప్యాక్ పెంపు

అంతేకాకుండా రోజుకు 2GB డాటా ప్యాక్ రూ.448 నుంచి రూ.444కి తగ్గించింది. ఈ ప్యాక్‌లో 1,000 నిమిషాలపాటు ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చేసుకోవచ్చు. అలాగే రూ.198 నెల ప్యాక్ ధరని రూ.222కి పెంచింది. IUC కాల్స్‌లో భాగంగా విధించే రూ.80 కలుపుకొని ఈ ప్యాక్ ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. 2 నెలల కాలపరిమితి కలిగిన ప్యాక్‌ను రూ.396కి బదులుగా రూ.333కి తగ్గించింది. ఈ రెండు పథకాల్లో వినియోగదారులు 1,000 నిమిషాలపాటు ఇతర నెట్ వర్క్స్‌కు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్స్ అన్నింటిలో 2GB డేటా ఉచితం.

స్కీం, కాలవ్యవధి, డేటా, ఐయూసీ నిమిషాలు...

స్కీం, కాలవ్యవధి, డేటా, ఐయూసీ నిమిషాలు...

- రూ.222 స్కీంలో 28 రోజుల కాల వ్యవధి, మొత్తం లభించే డేటా 56GB, IUC నిమిషాలు 1,000

- రూ.333 స్కీంలో 56 రోజుల కాల వ్యవధి, మొత్తం లభించే డేటా 112GB, IUC నిమిషాలు 1,000

- రూ.444 స్కీంలో 84 రోజుల కాల వ్యవధి, మొత్తం లభించే డేటా 168GB, IUC నిమిషాలు 1,000

- రూ.555 స్కీంలో 84 రోజుల కాల వ్యవధి, మొత్తం లభించే డేటా 168GB, IUC నిమిషాలు 3,000

ఇతర కంపెనీలతో పోలిస్తే 20 శాతం నుంచి 50 శాతం తక్కువ

ఇతర కంపెనీలతో పోలిస్తే 20 శాతం నుంచి 50 శాతం తక్కువ

మీరు ఇప్పటికే రూ.448తో జియో 2GB/ఒకరోజుకు డేటా ప్లాన్‌లో ఉంటే కనుక అదే ప్లాన్ వర్తిస్తుంది. లేదా మీరు ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు మారితే అదే మూడు నెలలకు రూ.444కు తగ్గుతుంది. ఇందులో ఇతర నెట్ వర్క్స్‌కు1000 నిమిషాల IUC కాల్స్ చేసుకోవచ్చు. ఇది రూ.80 విలువ కలిగిన అదనపు ప్రయోజనం. 56 రోజుల కాల పరిమితి ప్లాన్‌ను చూస్తే రూ.396 అవుతుంది. ఆల్ ఇన్ వన్ ప్లాన్‌తో ఇది రూ.333 మాత్రమే. తాము తాజాగా తీసుకు వచ్చిన ప్లాన్స్ పోటీ కంపెనీలతో పోలిస్తే 20 శాతం నుంచి 50 శాతం వరకు చౌక అని జియో పేర్కొంది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ పరిశీలిస్తే...

ఎయిర్‌టెల్, వొడాఫోన్ పరిశీలిస్తే...

ఇతర నెట్ వర్క్స్‌లతో పోలిస్తే... ఉదాహరణకు ఎయిర్ టెల్ నెలకు రూ.249 టారిఫ్ ప్లాన్ కలిగి ఉంది. అపరిమిత లోకల్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, ఒకరోజుకు 2GB డేటా ఉంది. వ్యాలిడిటీ 28 రోజులు. రెండు నెలల కాల వ్యవధిలో రూ.498 ఉంది. మూడు నెలల కాల వ్యవధిలో రూ.747 కలిగి ఉంది.

వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే అపరిమిత లోకల్ సాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, రోజుకు 2GB డేటా కలిగిన 28 రోజుల ప్లాన్‌కు రూ.229. రెండు నెలలు అయితే రూ.458. మూడు నెలలు అయితే రూ.687గా ఉంది. వీటితో పోలిస్తే జియో ధర చాలా తక్కువగా పేర్కొంటున్నారు.

English summary

జియో అదిరిపోయే 'ఆల్ ఇన్ వన్' స్కీం: ఎయిర్‌టెల్, ఐడియాతో పోలిస్తే.. | Reliance Jio All In One Plans Start at Rs 222 Which Includes Bundled Non-Jio Calls

Reliance Jio has fired another shot in the telecom battles with rival operators including Airtel and Vodafone Idea. The company has announced new All In One plans for the Jio mobile users.
Story first published: Tuesday, October 22, 2019, 10:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X