For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో ప్రముఖ సిని నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు

|

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లతో పాటు వారి స్నేహితుల నివాసాల్లోను సోదాలు నిర్వహించారు. వారి ఇళ్ల నుంచి ఐటీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్నారు.

'షేరు లాభాల్లోఉంటే తప్పుపట్టించుకోరని ఇన్ఫీ సీఈవో చెప్పారు!''షేరు లాభాల్లోఉంటే తప్పుపట్టించుకోరని ఇన్ఫీ సీఈవో చెప్పారు!'

వీరికి ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్లు ఉన్నాయి. ఐటీ సోదాల్లో భాగంగా కొండాపూర్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నైజాం ఏరియాలో ఏషియన్ సంస్థ పంపిణీదారుగా ఉంది. గతంలో భారీ చిత్రాలను పంపిణీ చేసింది. నటుడు మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ మాల్‌ను ఇదే సంస్థ ఏర్పాటు చేసింది. మరో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమాను రూపొందిస్తోంది.

 IT raids on Asian Cinemas owners

ఏషియన్ సినిమాస్ సినీ రంగానికి చెందిన వివిధ వ్యాపారాల్లో ఉంది. డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ ప్రొడక్షన్, థియేటర్ బిజినెస్‌లలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో మెజార్టీ భాగం ఏషియాన్ సినిమాస్‌దే. సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ పంపిణీ రంగంలో సక్సెస్ అయి థియేటర్ల నిర్మాణంలోనూ విజయం సాధించారు.

English summary

హైదరాబాద్‌లో ప్రముఖ సిని నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు | IT raids on Asian Cinemas owners

The Income Tax department on Tuesday carried out raids on the residences and offices of Sunil Narang and Narayana Das Narang, producers and distributors.
Story first published: Tuesday, October 22, 2019, 18:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X