For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేర్లు లాభాల్లో ఉంటే పట్టించుకోరు..: ఇన్ఫోసిస్ సీఈవో 'పక్కదారి' పట్టించారని ఆరోపణలు

|

బెంగళూరు: సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అనైతిక విధానాల ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తు తెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కొన్ని క్వార్టర్లలో సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నామని, స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలు పెంచి చూపిస్తున్నారని, ప్రస్తుత త్రైమాసికంలోను అలాంటి విధానాలే పాటిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 20వ తేదీన డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నట్లు వారు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారు తమను తాము నైతిక ఉద్యోగులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

లాభాలు పెంచి చూపుతున్నారని తీవ్ర ఆరోపణలు

కుంగిన ADR.. సీఈవోలపై వివాదం..

కుంగిన ADR.. సీఈవోలపై వివాదం..

ఇన్ఫోసిస్‌లో తాజా పరిమాణాల నేపథ్యంలో అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టైన ఇన్శోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఓ దశలో 16 శాతం వరకు నష్టపోయింది. కార్పోరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు గతలోను ఎదుర్కొంది ఇన్ఫీ. ఇజ్రాయెల్ టెక్నాలజీ సంస్థ వనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రజావేగుల ఆరోపణలు వచ్చాయి. దీనిపై నాటి సీఈవో విశాల్ సిక్కా, నారాయణ మూర్తి మధ్య వివాదం తలెత్తింది. 2017లో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గత ఏడాది సలీల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.

బోర్డు నుంచి స్పందన లేదని..

బోర్డు నుంచి స్పందన లేదని..

గుర్తు తెలియని ఉద్యోగులు సెప్టెంబర్ 20న బోర్డుకు లేఖ రాశారు. అయితే దీనిపై బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫిర్యాదుదారుల్లోని ఓ ప్రజావేగు అమెరికాలోని విజిల్ బ్లోయర్ ప్రొటక్షన్ ప్రోగ్రాం కార్యాలయానికి కూడా అక్టోబర్ 3న మరో లేఖ రాశారు. గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు పేర్కొన్నారు. జూన్- సెప్టెంబర్ క్వార్టల్లో లాభాలు ఎక్కువ చేసి చూపడం కోసం వీసా వంటి ఖర్చులను ఖాతాల్లో చూపవద్దని ఆదేశించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి వాయిస్ రికార్డ్ ఉన్నట్లు తెలిపారు.

కీలక సమాచారం బోర్డుకు తెలియనీయలేదు

కీలక సమాచారం బోర్డుకు తెలియనీయలేదు

ఓ కాంట్రాక్టు విషయంలో 50 మిలియన్ డాలర్ల విలువ చేసే మార్పులను పరిగణలోకి తీసకోవద్దని ఒత్తిడి తెచ్చినట్లు కూడా పేర్కొన్నారు. రివర్సల్స్ వల్ల క్వార్టర్ లాభాలకు గండిపడి షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తమతో చెప్పారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమాచారం ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా దాచిపెట్టారని ఆరోపించారు. కొన్ని కంపెనీలతో జరిగిన ఒప్పందాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసేలా తమపై ఒత్తిడి తెచ్చారని, వీటికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

షేర్ ధర బాగున్నంత కాలం బోర్డు పట్టించుకోదు..

షేర్ ధర బాగున్నంత కాలం బోర్డు పట్టించుకోదు..

సీఈవో పరేఖ్ చేతిలో నీలాంజన్ రాయ్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు కీలక సమాచారం చేరకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. బోర్డు సభ్యులకు ఈ విషయాలు ఏవీ అర్థం కావని, షేర్ ధర రాణించినన్ని రోజులు ఇవేమీ పట్టించుకోరని పరేఖ్ గతంలో చెప్పినట్లుగా కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రజావేగు ఫిర్యాదులను ఆడిట్ కమిటీ ముందు ఉంచుతామని కంపెనీ తెలిపింది. నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని చెప్పింది.

అనైతిక పద్ధతులను సమర్థించుకున్నారు..

అనైతిక పద్ధతులను సమర్థించుకున్నారు..

పరేఖ్ అనైతిక పద్ధతులను అనుసరించడమేగాక, వాటిని సమర్థించుకున్నారని ఉద్యోగులు బోర్డుకు తెలిపారు. మనం చేసే పనుల గురించి బోర్డులో ఎవరికీ అవగాహన ఉండదని, వారికి మార్కెట్‌లో సంస్థ షేర్ విలువ పెరిగితే చాలు సంతోషంగా ఉంటారని తమతో అన్నట్లు ఉద్యోగులు చెప్పడం గమనార్హం. దీంతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయిని అంటున్నారు. భారీ ఒప్పందాల్లో నిబంధనల అతిక్రమణ జరిగిందని, సమీక్షలు, అనుమతులు, సూచనలు లేకుండా పెద్ద పెద్ద డీల్స్‌కు పరేఖ్ పచ్చజెండా ఊపారని ఉద్యోగులు ఆరోపించారు.

ఆరోపణలు ఇవీ...

ఆరోపణలు ఇవీ...

- వీసా ఖర్చుల వంటి వాటిని పూర్తిగా గుర్తించరాదని గత త్రైమాసికంలో కంపెనీ కోరింది. అయితే ఆడిటర్లు వ్యతిరేకించడంతో దీనిని వాయిదా వేశారు. దీనికి సంబంధించి వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి.

- ఈ క్వార్టర్లో FDR కాంట్రాక్టుకు సంబంధించిన 50 మిలియన్ డాలర్ల చెల్లింపుల ఖాతాకు సంబంధించి కూడా ఖాతా ప్రమాణాలకు వ్యతిరేకంగా తమపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. వాటిని ఫలితాల్లో గుర్తిస్తే లాభాలు తగ్గి షేర్లపై ప్రభావం పడుతుందని చెప్పారన్నారు.

- వెరిజోన్, ఇంటెల్, జపాన్‌లో కొన్ని జేవీల వంటి పెద్ద కాంట్రాక్టులు, ఏబీఎన్ ఆమ్రో కొనుగోలు వంటి వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా చేశారు.

- పెద్ద పెద్ద ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని ఆడిటర్లకు చెప్పరాదని ఒత్తిడి తెచ్చినట్లు వారు ఆరోపించారు. బోర్డులో వీటిని ఎవరూ అర్థం చేసుకోరని, షేర్లు పెరిగినంత కాలం వాళ్లు సంతోషంగా ఉంటారని చెప్పారని తెలిపారు.

- గత కొన్ని త్రైమాసికాలుగా పలు భారీ ఒప్పందాలకు మార్జిన్లు తక్కువగా ఉన్నాయని, సున్నా కూడా ఉన్నాయని చెప్పారు. ఒప్పంద ప్రతిపాదనలు, మార్జిన్లు, బయటకు వెల్లడించని చెల్లింపు మొత్తాలు తదితరాల గురించి ఆడిటర్లను తనిఖఈ చేయమని బోర్డు కోరాలని పేర్కొన్నారు. ఆడిటర్లకు సమాచారం మొత్తం చెప్పలేదన్నారు.

- విధానాల మార్పు ద్వారా లాభాలు ఎక్కువ చూపాలి సీఈవో, సీఎఫ్ఓ తమను కోరారని, దీని వల్ల స్వల్పకాల లాభాలు కనిపిస్తాయన్నారు. అసంపూర్తి సమాచారాన్ని ఇన్వెస్టర్లు, ఇతరులతో పంచుకోవాలని సూచించారన్నారు.

- ఉద్యోగులు ఎవరైనా చెప్పింది వినకుంటే వారిని లీవులోకి పంపిస్తారని, లేదంటే పక్కన పెడతారని, చాలామంది ఉద్యోగులు ఒత్తిడి భరించలేక వెళ్లిపోయినట్లు చెప్పారు.

English summary

Infosys ADR sink over whistleblower's window dressing allegations

Information technology major Infosys saw its American Depositary Receipts (ADRs) on the NYSE sink by 12.91 per cent on Tuesday (as of 12.22 am), after the revelation that a group describing itself as ‘whistle-blower staffers’ had accused the management of hiding the true financial picture.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more