For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్‌కు భారీ షాక్: లాభాలు పెంచి చూపుతున్నారని తీవ్ర ఆరోపణలు

|

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు భారీ షాక్ తగిలింది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఈ విషయంలో సమీక్షలకు తావులేకుండా అనుమతులు బైపాస్ చేస్తున్నారన్నది ఆరోపణ. ఈ మేరకు కంపెనీలో పనిచేసే 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన ఒక బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు కు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసింది.

ఆరోపణలను రుజువు చేసేందుకు తమవద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ బృందం పేర్కొంది. సంబంధిత ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నాయని ఎథికల్ ఎంప్లాయిస్ గ్రూప్ చెప్పినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. వాటికి సంబంధించిన ఒక కాపీ ని ఈటీ కి ఇచ్చినట్లు కూడా పత్రిక వెల్లడించింది. దీంతో అలెర్ట్ ఐన కంపెనీ బోర్డు తమ ఆడిట్ కమిటీ కి ఈ విషయాన్నీ పరిశీలించాలని సిఫారసు చేసింది. తమ విజిల్ బ్లోయర్ పాలసీ కి అనుగుణంగా తగు చర్య తీసుకొంటామని ఇన్ఫోసిస్ ఆదివారం రాత్రి అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ కు సమర్పించిన స్టేట్ మెంట్ లో తెలిపింది.

బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఈ చిట్కాలు తెలుసుకోవాల్సిందే

బిలియన్ డాలర్ల కాంట్రాక్టులో అవకతవకలు..

బిలియన్ డాలర్ల కాంట్రాక్టులో అవకతవకలు..

ఇన్ఫోసిస్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ కు అలాగే అమెరికా ఎస్ఈసి కి రాసిన ప్రత్యేక లేఖల్లో ఎథికల్ ఎంప్లాయిస్ గ్రూప్ ... ఇటీవలి కొన్ని క్వార్టర్స్ లో కుదిరిన కొన్ని బిలియన్ డాలర్ల డీల్స్ లో ఎలాంటి మార్జిన్లు లేవని ఆరోపించింది. వీటికి సంబంధించిన వివరాలను తాము బోర్డుకు ఇచ్చే ప్రెసెంటేషన్స్ లో వెల్లడించకుండా కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) అడ్డుకున్నట్లు పేర్కొంది. అందుకే, ఆడిటర్లను ఆయా డీల్స్ కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని, మార్జిన్లు, అప్రకటిత ముందస్తు కమిట్మెంట్లు, రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది. వీసా ఖర్చులను పూర్తిగా ఒక క్కుఆర్టర్లో చూపొద్దని చెప్పారని, 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ 350 కోట్లు) విలువైన రెవెర్సల్స్ కూడా పొందుపరచకూడని చెప్పారని తెలిసింది.

వెరిజోన్, ఇంటెల్ కంపెనీల డీల్స్...

వెరిజోన్, ఇంటెల్ కంపెనీల డీల్స్...

విజిల్ బ్లోయర్ గ్రూప్... తమ లేఖల్లో ప్రముఖ దిగ్గజ కంపెనీల డీల్స్ ను ప్రస్తావించింది. అందులో వెరిజోన్, ఇంటెల్, జపాన్ కు చెందిన జాయింట్ వెంచర్స్, ఏబీఎన్ అమ్రో తదితర భారీ డీల్స్ లో రాబడి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం లేవని ఆరోపించింది. సీఈఓ సలీల్ పరేఖ్, సిఎఫ్ఓ నీలాంజన్ రాయ్ విధానాల్లో మార్పులు చేస్తూ ట్రెజరీ మానేజ్మెంట్ లో మార్పులు చేయాలనీ కంపెనీ ఫైనాన్స్ టీం పై ఒత్తిడి తెస్తున్నారని ఈ బృందం ఆరోపించింది. కీలకమైన అంశాలను ఫారం 20 ఎఫ్ లో ప్రస్తావించవద్దని చెబుతున్నారని, అలాగే అనలిస్టులు, ఇన్వెస్టర్లతో కంపెనీకి సంబంధించిన మంచి అంశాలను మాత్రమే వెల్లడించాలని కోరుతున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది.

పెద్ద వారు వైదొలిగితే..

పెద్ద వారు వైదొలిగితే..

కంపెనీలో పెద్ద పోస్టుల్లో ఉవుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ోయర్ ఆరోపణలు అధికం అవుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఇన్ఫోసిస్ ఫౌండర్ యెన్ఆర్ నారాయణ మూర్తి తో పొసగక మాజీ సీఈఓ విశాల్ సిక్కా 2017 లో రాజీనామా చేసినప్పుడు కూడా విజిల్ బ్లోయర్ కంప్లైంట్ రాగా.. ప్రస్తుతం కంపెనీ డిప్యూటీ సిఎఫ్ఓ జయేష్ సంగ్రఙ్కా నిష్క్రమణ తర్వాత ఇలాంటి ఆరోపణ రావటం గమనార్హం. ఇదిలా ఉండగా .. ఈ విజిల్ బ్లోయర్ బృందం ఇన్ఫోసిస్ బోర్డు కు రాసిన లేఖ సెప్టెంబర్ 20, 2019 న ఉండగా... అమెరికా ఎస్ఈసి కి అదే నెల 27న లేఖ రాసింది. అక్టోబర్ 3న మరో ఫాలో అప్ మెయిల్ కూడా పంపింది. ఇన్ఫోసిస్ షేర్లు భారత స్టాక్ మార్కెట్ల తో పాటు అమెరికా లో ఏడీఆర్ ల రూపం లో ట్రేడ్ అవుతాయి.

English summary

Whistleblower accuses Infosys of unethical practices to boost numbers

An anonymous group calling itself ethical employees has complained to the board of Infosys and the US Securities and Exchange Commission (SEC) alleging that the company is taking unethical steps to boost short-term revenue and profits and stating that the complainants have emails and voice recordings to substantiate the claims.
Story first published: Monday, October 21, 2019, 9:41 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more