For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్మలా సీతారామన్ నా స్నేహితురాలి, తెలివైనవారు: అభిజిత్ బెనర్జీ

|

భారత ఆర్థిక వ్యవస్థపై బీజేపీ నాయకులు, అభిజిత్ బెనర్జీ మధ్య ఒకింత మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరోక్షంగా తిప్పికొట్టారు. కేంద్ర ఆర్థిక విధానాలపై అభిజిత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా తిప్పికొట్టారు. ఆయనది లెఫ్టి లానింగ్ ఎకనమిస్ట్ వాదన అన్నారు.

దీనిపై అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ తనకు స్నేహితురాలని, ఆమె కూడా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (JNU) తనతు కలిసి చదువుకున్నారని గుర్తు చేశారు. JNUలో తనకు తెలిసిన వారిలో నిర్మల కూడా ఉన్నారన్నారు. తమ సమకాలీనురాలు అని, తాము క్లోజ్ ఫ్రెండ్స్‌ము అని, కానీ అభిప్రాయ విభేదాలు ఉన్నాయన్నారు.

Nirmala Sitharaman Was My Contemporary In JNU, Says Abhijit Banerjee

విశ్వవిద్యాలయం అనేది విభిన్న అభిప్రాయాలు కలిగిన ప్రదేశం అన్నారు. విమర్శనాత్మకంగా ఉండటం ఒకటి అయితే, విభిన్న అభిప్రాయాలపై చర్చించడం మరొక విషయం అన్నారు. ఈ రెండూ ముఖ్యమైనవేనని చెప్పారు.

1983లో అభిజిత్‌ JNUలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేయగా, నిర్మల కూడా ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌తో పాటు 1984లో ఎంఫిల్‌ పూర్తి చేశారు. దేశం గురించి JNUలో తాను ఎంతో నేర్చుకున్నానని అభిజిత్‌ తెలిపారు. నిర్మల చాలా తెలివైనవారు అన్నారు.

చైనా నుంచి భారత్‌వైపు 200 కంపెనీల చూపు..చైనా నుంచి భారత్‌వైపు 200 కంపెనీల చూపు..

న్యాయ్ స్కీంపై ఏం చెప్పారంటే
కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి తాను సూచించిన న్యాయ్ స్కీంపై వస్తున్న విమర్శలకు అభిజిత్ స్పందించారు. ఆ పథకాన్ని సరిగా రూపొందించలేదని అంగీకరించారు. న్యాయ్‌ పథకాన్ని వాస్తవానికి సరిగా రూపొందించలేదని, దానిని ఎలా రూపొందించాలని తనను ఎవరూ అడుగలేదన్నారు. కాబట్టి దానికి తనది బాధ్యత కాదన్నారు.

న్యాయ్ ఒక ఐడియా అని, దానికి రాజకీయంగా మద్దతు లభించినా అది మంచిగా రూపొందించిన పథకం కాకపోవచ్చునని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా వారు అందులో మార్పులు చేయాల్సి వచ్చేదన్నారు. పథకం రూపొందించడం తన పాత్ర కాదని, నిర్ణయాలు తీసుకునేందుకు సమాచారం ఇవ్వడమే తన పని అన్నారు.

English summary

నిర్మలా సీతారామన్ నా స్నేహితురాలి, తెలివైనవారు: అభిజిత్ బెనర్జీ | Nirmala Sitharaman Was My Contemporary In JNU, Says Abhijit Banerjee

"One of the people I knew well and we were on similar sides of certain issues was Nirmala Sitharaman.She was my contemporary in JNU... I wouldn't say we were close friends, but we were friends and it is not that we had deep disagreements".
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X