For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే పర్సులో రూపే, మాస్టర్, వీసా కార్డులు.. తేడాలేంటో తెలుసా?

|

ఈ రోజుల్లో ఒకటికి మించి బ్యాంకు ఖాతాలున్న వారు అనేక మంది ఉంటారు. ఖాతాలున్న ప్రతి బ్యాంకు నుంచి డెబిట్ కార్డు తీసుకుంటారు. కొన్ని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డును పొందుతారు. చాలా మంది ఈ కార్డులను వినియోగిస్తారే తప్ప తమ కార్డు పై వీసా, మాస్టర్ లేదా రూపే అని రాసి ఉన్న దాన్ని అంతగా గమనించారు. ఒకవేళ గమనించినా వీటి మధ్య ఉన్న తేడా ఏమిటన్న దాని గురించి పెద్దగా పట్టించుకోరు. మనం బ్యాంకునుంచి ఈ కార్డులను తీసుకున్నా బ్యాంకు పేరుతో పాటు ఈ మూడింటిలో ఏదో ఒక పేరు ఉంటుంది. ఈ కార్డుల మధ్య ఉన్న తేడాలు ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటన్న విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి...

మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?

రూపే కార్డు కహానీ ఇది..

రూపే కార్డు కహానీ ఇది..

* ఈ కార్డును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎంపీసీఐ) 2012 మార్చిలో విడుదల చేసింది. దేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రూపే కార్డు రూపకల్పన జరిగింది. రూపే అనేది మనదేశ సొంత నెట్ వర్క్. వీసా, మాస్టర్ కార్డు, డిస్కవర్, డిన్నర్ క్లబ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్ వంటి అంతర్జాతీయ పేమెంట్ నెట్ వర్క్స్ మాదిరిగానే రూపే ను అభివృద్ధి చేశారు.

* రూపే కార్డు రావడానికి పూర్వం అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ ల హవా ఉండేది. వీటి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టేందుకే రూపే కార్డు ను తెచ్చారు. ఈ కంపెనీలు చల్ల ఎక్కువగా చార్జీలను వసూలు చేసేవి. ఫలితంగా ఈ కార్డుల ద్వారా నిర్వహించే లావాదేవీల వ్యయం ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో రూపే కార్డు రావడంతో వీసా, మాస్టర్ కార్డులకు పోటీ ఎక్కువయింది. రూపే కార్డును ఇండియన్ పేమెంట్ గేట్ వే గా చెప్పవచ్చు.

* రూపే కార్డు కూడా వీసా లేదా మాస్టర్ కార్డుల మాదిరిగానే పనిచేస్తుంది. కమీషన్ మాత్రం తక్కువగా ఉంటుంది. అన్ని భారత బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ఎలక్ట్రానిక్ చెల్లింపులకు ఇది ఉపయోగ పడుతుంది.

* అన్ని బ్యాంకులు ఇప్పుడు రూపే కార్డును జారీ చేస్తున్నాయి. రూపే కార్డులో అన్ని రకాల భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

వీసా, మాస్టర్ కార్డులు

వీసా, మాస్టర్ కార్డులు

* ఈ కార్డులు ప్రపంచ వ్యాప్తంగా అనేక బ్యాంకులకు చెల్లింపుల సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఈ రెండు కార్డుల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. వీటి పనితీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కార్డులు కాబట్టి ఎక్కడైనా సులభంగా చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. రూపే కార్డు కూడా విదేశాల్లో వినియోగించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.

* రూపే కార్డు ఇండియన్ డొమెస్టిక్ డెబిట్ కార్డు అయితే వీసా లేదా మాస్టర్ కార్డులు ఇంటర్నేషనల్ సిస్టమ్ డెబిట్ కార్డు లు.

* ఈ మూడు కార్డుల మధ్య నిర్వహణ వ్యయాల్లో తేడా ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డు కన్నా రూపే సర్వీస్ చార్జీ తక్కువగా ఉంటుంది.

* వీసా డెబిట్ కార్డు లేదా మాస్టర్ కార్డు వంటి విదేశీ పేమెంట్ నెట్ వర్క్ లో చేరడానికి బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రూపే కార్డుకు అవసరం లేదు. ఏ బ్యాంకయినా రూపే నెట్ వర్క్ లో చేరవచ్చు.

* రూపే కార్డు వినియోగం విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం అనేక బ్యాంకులు డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డుల జారీ ఇంకా పెరగాల్సి ఉంది. వీసా, మాస్టర్ కార్డులు ఈ రెండు కార్డులను అందిస్తున్నాయి. వీసా, మాస్టర్ కార్డులతో పోల్చితే రూపే కార్డు లావాదేవీ ప్రాసెసింగ్ బాగా తక్కువగా ఉంటుంది.

* రూపే కార్డులు ఎక్కువ భద్రమైనవని భావిస్తారు. ఎందుకంటే దీని కార్యకలాపాలు దేశానికే పరిమితమై ఉంటాయి. కాబట్టి డాటాను దేశీయ గేట్వేల మద్యనే పంపిణి జరుగుతుంది. వీసా, మాస్టర్ కార్డుల కస్టమర్ డేటా అంతర్జాతీయంగా ప్రాసెస్ జరుగుతుంది.

* ఇంటర్నేషనల్ కార్డ్స్ కోసం బ్యాంకులు వాటి నెట్ వర్క్ లో చేరేందుకు ఫీజు చెల్లించాలి. రూపే కార్డు అయితే ఉండదు.

* రూపే కార్డును ప్రభుత్వ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు జారీ చేస్తున్నాయి.

ఆఫర్లు

ఆఫర్లు

* రూపే కార్డు వచ్చిన తర్వాత వీసా, మాస్టర్ కార్డులకు కాస్త సెగ తగిలింది. పలు రకాల ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో బ్యాంకులు కూడా రూపే కార్డును జారీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

* రూపే కార్డు తన వినియోగదారులకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇవ్వడానికి ఎప్పటికప్పుడు వినూత్నంగా వ్యవహరిస్తోంది. రూపే కార్డుల ద్వారా లావాదేవీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

English summary

ఒకే పర్సులో రూపే, మాస్టర్, వీసా కార్డులు.. తేడాలేంటో తెలుసా? | difference between rupay and visa card and mastercard

The main difference between RuPay, MasterCard or Visa Debit Card is the operating costs. Since every transaction through RuPay will take place within India, the banks will have to pay less service charges to the payment gateway as compared to Visa, MasterCard.
Story first published: Friday, October 18, 2019, 10:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X