For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణీకులకు మరో షాక్, 19 నుంచి క్యాబ్స్ బంద్

|

హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు వివిధ డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు విపక్షాలు, కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ప్రయాణీకులు.. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రయాణీకులు క్యాబ్స్, మెట్రోలను ఆశ్రయిస్తున్నారు.

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

ఇప్పుడు ప్రయాణీకులకు మరో షాక్ తగలనుంది. క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఉబెర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న 50 వేల మంది క్యాబ్‌లు సమ్మెల్లో పాల్గొననున్నాయి. ఈ మేరకు తెలంగాణ ట్యాక్సీ, డైవర్స్ ఐకాస చైర్మన్ వెల్లడించారు.

50,000 Uber, Ola cabs to go off the roads on Oct 19 in Telangana

వీరి డిమాండ్ ఏమిటి?
కిలో మీటరుకు కనీసం రూ.22 ఛార్జ్ చేయాలన్న డిమాండుతో సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది రూ.12 మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు కనీస వ్యాపార హామీ అందించాలని, ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్న వారికి జీవో నెంబర్ 61, 66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలన్నారు. ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

English summary

ప్రయాణీకులకు మరో షాక్, 19 నుంచి క్యాబ్స్ బంద్ | 50,000 Uber, Ola cabs to go off the roads on Oct 19 in Telangana

About 50,000 Uber and Ola drivers will join the TSRTC employees in observing the State-wide bandh on October 19.
Story first published: Friday, October 18, 2019, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X