For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు దీటుగా.. ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’!

|

ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌కు దీటైన పోటీ ఇస్తోన్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా వినోద రంగంలోకి కూడా ప్రవేశించింది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌లోనూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు దీటైన పోటీ ఇచ్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకుంటోంది.

ఈ సంస్థ ఇటీవలే 'ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్' పేరిట వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రారంభించింది. దిగువ, మధ్య స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా.. ఫ్లిప్‌కార్ట్ తన వీడియో కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుందనే వార్త అమెజాన్‌ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

శరవేగంగా వీడియో స్ట్రీమింగ్...

శరవేగంగా వీడియో స్ట్రీమింగ్...

మన దేశంలో వీడియో స్ట్రీమింగ్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏడాదికి 21.8 శాతం వృద్ధితో ఈ వ్యాపారం దూసుకుపోతోంది. 2023 నాటికి ఈ వీడియో స్ట్రీమింగ్ వ్యాపారం రూ.11,977 కోట్లకు చేరుతుందని అంచనా.

ఇప్పటివరకూ 34 కంపెనీలు...

ఇప్పటివరకూ 34 కంపెనీలు...

భారత్‌లో ప్రస్తుతం దేశీ, విదేశీ వీడియో స్ట్రీమింగ్ కంపెనీలు 34 వరకు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆల్ట్ బాలాజీ, జియో, ఈరోస్ నౌ, బిగ్‌ఫ్లిక్స్, వూట్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. నెలవారీ చందా వసూలు చేసే ఈ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసుల మార్కెట్ కూడా ప్రతి సంవత్సరం 23.3 శాతం వ‌ృద్ధిని నమోదు చేస్తోంది.

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా...

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా...

ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే ఈ వీడియో స్ట్రీమింగ్, వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్‌ల్లోకి అడుగుపెట్టింది. ఇంటర్నెట్‌లో వీడియోలు, సినిమాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకున్న ఫ్లిప్‌కార్ట్.. దిగువ, మధ్య స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా పెట్టుకుంది.

టార్గెట్ 200 మిలియన్ల వినియోగదారులు...

టార్గెట్ 200 మిలియన్ల వినియోగదారులు...

ఫ్లిప్‌కార్ట్‌కు ఇప్పటికే 160 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. వీరందరికీ వీడియో కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వినోద రంగంలో మొత్తం 200 మిలియన్ల వినియోగదారులను సాధించడమే లక్ష్యంగా ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

కంటెంట్ క్రియేటర్‌గా ఆస్కార్ విజేత...

కంటెంట్ క్రియేటర్‌గా ఆస్కార్ విజేత...

‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్'కు కంటెంట్ క్రియేటర్‌గా ఆస్కార్ విజేత గునీత్ మొంగా వ్యవహరిస్తారని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ ‘బ్యాక్ బెంచర్స్' పేరుతో ఒక సిరీస్ కూడా నిర్వహించనున్నారని, ఇది ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్' నవంబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు.

అన్ని భాషల్లో, అన్ని కేటగిరీలలో...

అన్ని భాషల్లో, అన్ని కేటగిరీలలో...

అంతేకాదు, నెటిజన్లను ఆకర్షించడంలో వినోదభరితమైన కంటెంట్‌తో కూడిన వీడియోలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తులో స్టూడియో నెక్స్ట్, ఫ్రేమ్స్, సిఖ్యా ప్రొడక్షన్స్ తదితర నిర్మాణ సంస్థలతో కూడా తాము ఒప్పందాలు కుదుర్చుకుంటామని, అన్ని భాషల్లో, అన్ని కేటగిరీలలో నాణ్యమైన వీడియో కంటెంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా తెలిపారు.

ఉచితంగా వీడియో కంటెంట్?

ఉచితంగా వీడియో కంటెంట్?

అయితే వినోద రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశించడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, తమ వినియోగదారులకు ఈ వీడియో కంటెంట్‌ను ఉచితంగానే అందించనున్నామని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా ప్రకటించారు. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్‌ప్లిక్స్ తదితర వీడియో సర్వీసులను వీక్షించేందుకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్ ఉచితం అనడంతో ఈ వీడియో స్ట్రీమింగ్ కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది.

English summary

అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు దీటుగా.. ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’! | Flipkart Video Originals Launched to Take on Amazon Prime

Taking Amazon Prime head-on, Walmart-owned Flipkart on Tuesday forayed into original video content in India with the launch of 'Flipkart Video Originals' as the over-the-top media services (OTT) war heats up in the country.
Story first published: Thursday, October 17, 2019, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X