For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ రిటైల్ బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్, రూ.2,500 కోట్ల పెట్టుబడి

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రూ.2500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఫ్లి‌ప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసింది. ఫ్లి‌ప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ద్వారా తమ సొంత ప్రయివేటు లేబుల్ ద్వారా పూర్తిస్థాయి ఫుడ్ రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. కిరాణా సరుకు సరఫరాతో పాటు రిటైల్ ఓపెన్ స్టోర్స్ నిర్వహిస్తుంది.

ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?

ఫుడ్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఎంతో చేయగలుగుతుందని, కిరాణా వ్యాపార విస్తరణ కోసం రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బోర్డు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థ ద్వారా స్థానిక ఉత్పత్తులతో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్‌ను నేరుగా వినియోగదారులకు అందిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా వీటిని విక్రయిస్తారు. స్థానిక చట్టాలకు అనుగుణంగానే వ్యాపారం చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Flipkart confirms it is entering the food retail business in India

ఈ వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్ ఆలస్యంగా వచ్చింది. అమెజాన్ 2017 జూలైలోనే పుడ్ రిటైల్ లైసెన్స్ తీసుకుంది. అప్పటి నుంచి గ్రాసరీ బిజినెస్‌ను పెంచుకుంటూ వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ రిటైల్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (DIPP) అనుమతి అవసరం.

కొత్త వ్యాపారం కోసం ఇప్పటికే వేలాదిమంది రైతుల్ని కూడా సంప్రదించారని తెలుస్తోంది. వారందరితో కలిసి పని చేస్తారు. దేశంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవోలు), ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎంతోమంది రైతులకు ఆదాయాన్ని ఇస్తున్నాయని, అలాగే నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే లక్షలాది మందికి అందిస్తున్నాయని చెబుతున్నారు.

భారత్‌లో అయిదేళ్లలో దేశంలో 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు అమెజాన్ ఇటీవల తెలిపింది. ఆమెజాన్ ఇండియా ఇప్పటికే అమెజాన్ నౌ, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ఫ్రెష్ వంటి వ్యాపారాల్ని ప్రారంభించింది. ఈ కామర్స్ సంస్థలు ఆహార పదార్థాలను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు భారతీయ చట్టాలు అనుమతిస్తున్నాయి. ఇతర ఉత్పత్తులను మాత్రం థర్డ్ పార్టీ సెల్లర్స్‌తోనే విక్రయించాలి.

English summary

ఫుడ్ రిటైల్ బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్, రూ.2,500 కోట్ల పెట్టుబడి | Flipkart confirms it is entering the food retail business in India

Flipkart, the Walmart owned Indian e-commerce company, has registered a new company called Flipkart Farmermart Pvt in India to deepen its penetration in the food retail space, take on Amazon, and run a farm-to-fork operation.
Story first published: Wednesday, October 16, 2019, 9:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X