For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆర్థిక వ్యవస్థని నాశనంచేస్తాం: ట్రంప్ హెచ్చరికని లెక్కచేయని మార్కెట్లు

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ టర్కీపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ పైన టారిఫ్ 50 శాతానికి పెంచారు. సిరియాలో కుర్దుల ఆదీనంలోని ఈశాన్య ప్రాంతాలపై సైనిక దాడికి పాల్పడుతోందంటూ టర్కీపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా స్టీల్ పైన టారిఫ్ పెంచుతున్నామని, 100 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలకు స్వస్తీ పలుకుతున్నట్లు తెలిపారు.

<strong>టాప్ దానశీలుల్లో శివనాడార్, ప్రేమ్‌జీ</strong>టాప్ దానశీలుల్లో శివనాడార్, ప్రేమ్‌జీ

టర్కీ సైనిక చర్య సిరియాలోని సామాన్య పౌరులను బలిగొంటుందన్నారు. అక్కడ సుస్థిరతకు, శాంతికి, భద్రతకు భంగం కలిగిస్తోందన్నారు. ఇవి సంక్షోభానికి దారి తీస్తున్నాయని, ఇలాగే కొనసాగిస్తే టర్కీ ఆర్థిక వ్యవస్థలను అత్యంత వేగంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అంతేకాదు, సిరియాలో సైనిక దాడులకు కారణం అవుతున్న టర్కీ నేతలపై కఠిన నిషేధ ఆజ్ఞలు విధిస్తున్నట్లు తెలిపారు.

 Trump halts trade negotiations with Turkey, raises its steel tariffs to 50%

వారు ఆస్తులను స్తంభింపచేయడం, అమెరికాలోకి రాకుండా అడ్డుకోవడం వంటి వివిధ రకాల కఠిన ఆంక్షలు ఉంటున్నాయన్నారు. స్టీల్ పైన సుంకాలను 50 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం తన ట్విట్టర్ అకౌంటులో సుదీర్ఘ పోస్టును చేశారు.

ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు టర్కీ నో
ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో టర్కీ మార్కెట్లపై ప్రభావం పడుతుందని భావించినా, అది జరగలేదు. టర్కీకి చెందిన కరెన్సీ లిరా వ్యాల్యూ పెరిగింది. అంటే మార్కెట్లు ట్రంప్ బెదిరింపులను పట్టించుకోనట్లుగా ఉంది. నేటి సెషన్లో లిరాతో డాలర్ విలువ 1 శాతం పడిపోయింది. మంగళవారం ఉదయం గం.8.00 (లండన్ సమయం)కి 5.8628 వద్ద ట్రేడ్ అయింది.

English summary

మీ ఆర్థిక వ్యవస్థని నాశనంచేస్తాం: ట్రంప్ హెచ్చరికని లెక్కచేయని మార్కెట్లు | Trump halts trade negotiations with Turkey, raises its steel tariffs to 50%

President Donald Trump signed an executive order sanctioning Turkish officials, hiking tariffs on Turkish steel up to 50% and “immediately” halting trade negotiations with the country, Vice President Mike Pence confirmed Monday.
Story first published: Tuesday, October 15, 2019, 15:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X