For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల ఉత్పత్తులతో ప్రొటీన్: గోద్రేజ్, జెర్సీ రిపోర్ట్ నివేదిక ఇదీ

|

హైదరాబాద్: గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్ డెయిరీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ ఈ రోజు (అక్టోబర్ 15) 'సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్' అక్నాలెడ్జ్ నివేదికను ఆవిష్కరించింది. ఈ రిపోర్ట్‌ను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ధరిణి కృష్ణణ్, క్రీమ్ లైన్ డెయిరీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, క్రీమ్ లైన్ డెయిరీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ సీఈవో రాజ్ కన్వార్‌లు లాంచ్ చేశారు.

రైతులు, ప్రాసెసర్స్, కన్స్యూమర్స్ కలిగి ఉన్న ప్రస్తుత ఎకోసిస్టమ్ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, అలాగే పాల ఉత్పత్తుల సంభావ్య పాత్రను అధ్యయనం చేయడానికి గోద్రెజ్ జెర్సీ.. కార్వీ ఇన్‌సైట్స్‌ను నియమించింది. ఈ రిపోర్ట్ ప్రొటీన్ వినియోగం గురించి వెల్లడిస్తోంది.

83% milk non consumers are protein deficient states Godrej jersey report

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది వినియోగదారులకు రోజూవారి ఆహారంలో ప్రొటీన్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసు. 68 శాతం మందికి ఇది తెలియదు. పాల ఉత్పత్తుల ద్వారా ప్రొటీన్ పెరుగుతుందని 92 శాతం మంది వినియోగదారులకు తెలుసు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 32 శాతం మంది పెద్దలు మాత్రమే పాలు తీసుకుంటున్నారట.

75 శాతం మంది పాలను ముఖ్యమైన ప్రొటీన్ వనరుగా భావిస్తున్నారు. అయితే ఈ సర్వేలో 62 శాతం మంది శాఖాహార పెద్దలు ప్రొటీన్ లోపం కలిగి ఉన్నారు. పాలు తాగని వినియోగదారుల్లో 83 శాతం మంది ప్రొటీన్ లోపం ఉన్నట్లుగా రిపోర్ట్ ద్వారా వెల్లడవుతోంది. 'సౌత్ ఇండియా ప్రొటీన్ గ్యాప్' రిపోర్ట్ వినియోగదారులకే కాకుండా మొత్తం ఎకోసిస్టం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, దక్షిణ భారతాన్ని ప్రొటిన్‌సహితంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. గోద్రోజ్ జెర్సీ పాలు, మజ్జిగ, పెరుగు, రుచిగల పాలు, పన్నీర్ వంటి ఆరోగ్యకర పాల ఉత్పత్తులను అందిస్తోంది. ఇవన్నీ కూడా పై రిపోర్ట్ సిఫార్స్ చేసిన ప్రోటీన్ అనుకూల పదార్థాలు.

English summary

పాల ఉత్పత్తులతో ప్రొటీన్: గోద్రేజ్, జెర్సీ రిపోర్ట్ నివేదిక ఇదీ | 83% milk non consumers are protein deficient states Godrej jersey report

Creamline dairy products Ltd, a subsidiary of Godrej Agrovet Limited today unveiled the south india protein gap - a knowledge report.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X