For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF రూల్స్ మారొచ్చు: ఉద్యోగులకు ప్రయోజనం ఎలా, సంస్థలకు దెబ్బ!

|

ప్రస్తుతం 6 కోట్లమందికి పైగా సేవలు అందిస్తున్న పురాతన సోషల్ సెక్యూరిటీ స్కీం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF). దీనిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎంప్లాయి ఫ్రెండ్లీగా సంస్కరిస్తోంది. తాజాగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం EPF రూల్‌లో మరో మూడు మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలుస్తోంది. వీటికి ఓకే చెబితే మీపై ప్రాభవం కూడా చూపనుంది.

చాలామంది తెలుసుకోవాల్సిన విషయం... పీపీఎఫ్‌లో ఎలా ఎక్కువ లాభంచాలామంది తెలుసుకోవాల్సిన విషయం... పీపీఎఫ్‌లో ఎలా ఎక్కువ లాభం

వేతన మార్పు దిశగా అడుగు...

వేతన మార్పు దిశగా అడుగు...

ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను వేతనం నిర్వచిస్తుంది. ఇందులో బేసిక్ శాలరీ, డీఏ ఉన్నాయి. ఈ ఏడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వేతనంలో అన్ని నాన్ వేరియబుల్ అలవెన్సులు కూడా ఉండనున్నాయి. ఉద్యోగులు అందుకునే అలవెన్సులు కూడా బేసిక్ వేతనంగా పరిగణించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఉద్యోగికి ప్రయోజనం

ఉద్యోగికి ప్రయోజనం

ప్రత్యేక అలవెన్సులను మూల వేతనం కిందకు పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఉద్యోగి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీంతో కంపెనీ కూడా కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగికి వచ్చే వేతనంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగు ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి ఇది కంపెనీలకు భారం కానున్నాయి. ఇది మొదటి ప్రతిపాదన.

వివిధ కేటగిరీల ఉద్యోగులకు వివిధ రకాల కాంట్రిబ్యూషన్

వివిధ కేటగిరీల ఉద్యోగులకు వివిధ రకాల కాంట్రిబ్యూషన్

ఒక నిర్దిష్ట కాలానికి వేర్వేరు కేటగిరీలకు చందిన ఉద్యోగులకు వివిధ రకాల కాంట్రిబ్యూషన్ విధానాన్ని అనుసరించాలనేది రెండో ప్రతిపాదన. తక్కువ వేతనం వచ్చే వారికి ఇది ఎంతో మంచి వార్త. వేతనం తక్కువగా ఉన్న వారి టేక్ హోమ్ శాలరీ ఎక్కువ అవుతుంది.

ఈపీఎస్ నుంచి ఎన్పీఎస్‌కు ట్రాన్సుఫర్

ఈపీఎస్ నుంచి ఎన్పీఎస్‌కు ట్రాన్సుఫర్

EPF పెన్షన్ స్కీం నుంచి NPSకు నిధుల బదలీ ప్రతిపాదన మూడోది. యజమాని కాంట్రిబ్యూషన్ 12 శాతం ఉండగా, ఇందులో 8 శాతం ఈపీఎస్ అకౌంట్‌లోకి వెళ్తుంది. ఈ ఫండ్‌ను NPS ఖాతాకు బదలీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ట్రాన్సుఫర్ నచ్చకపోతే తిరిగి ఈపీఎఫ్‌కు ఫండ్స్ బదలీ చేసే అవకాశం కూడా కల్పించనుంది. ఇది ఉద్యోగులకు ప్రయోజనకరం.

English summary

PF రూల్స్ మారొచ్చు: ఉద్యోగులకు ప్రయోజనం ఎలా, సంస్థలకు దెబ్బ! | Centre proposes 3 changes to EPF rule: This is how you will be impacted

Employee Provident fund is the oldest social security scheme that is currently serving as many as 6 crore subscribers. To make it further, subscriber-friendly, the government is pushing changes to the original EPF law which has for last many years gone digital.
Story first published: Monday, October 14, 2019, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X