For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు వరల్డ్ బ్యాంక్ ఝలక్: మన కంటే బంగ్లాదేశ్, నేపాల్ సూపర్

|

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు ఆరు శాతానికి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తొలి త్రైమాసికాలలో వృద్ధి రేటు భారీగా మందగించింది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు వృద్ధి ఆందోళనను కలిగిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతంగా ఉన్న వృద్ధి రేటులో 0.9 శాతం మేర కోత పడనుందని తెలిపింది.

2021లో వృద్ధి రేటు 6.9 శాతానికి, 2022లో 7.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఆదాయ వృద్ధి, పన్ను ప్రోత్సాహకాల వంటి పథకాల ఫలితాలతో గ్రామీణ భారత్‌లో డిమాండ్ పెరుగుతుందని, తద్వారా వృద్ధి పుంజుకునే అవకాశముందని అభిప్రాయపడింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో వార్షిక సమావేశం నిర్వహించడానికి కొద్ది రోజుల ముందు దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులు పేరిట ఈ నివేదికను విడుదల చేసింది. ట్రేడ్ వార్, అంతర్జాతీయ పరిణామాలు, మందగమనం నేపథ్యంలో ఎగుమతుల వృద్ధిలో కూడాస్తబ్దత నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.

World Bank Cuts Indias Growth Forecast To 6%

నేపాల్, బంగ్లాదేశ్ వృద్ధి రేటు భారత్ కంటే ఎక్కువగా ఉంది. నేపాల్ వృద్ధి రేటును 6.5 శాతంగా, బంగ్లాదేశ్ వృద్ధి రేటును 8.1 శాతంగా, ఆప్గనిస్తాన్ వృద్ధి రేటును 3 శాతంగా, మాల్దీవుల వృద్ధి రేటును 5.2 శాతంగా, శ్రీలంక వృద్ధి రేటును 2.7 శాతంగా అంచనా వేసింది.

భారత వృద్ధి రేటు అంచనా నేపాల్, బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది. కాగా, వృద్ధి రేటు తగ్గడం, ఆహార ధరలు తక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం 3.4 శాతానికే పరిమితమైందని తెలిపింది. దీంతో ద్రవ్యోల్భణాన్ని 4 శాతం కంటే తక్కువగా ఉంచాలనే ఆర్బీఐ లక్ష్యం నెరవేరడంతో వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడానికి వెసులుబాటు కలిగిందని వరల్డ్ బ్యాంకు తెలిపింది.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ వృద్ధి అంచనాను 6.1 శాతానికి సవరించింది. ఆసియాభివృద్ధి బ్యాంకు కూడా వృద్ధఇ అంచనాను 7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. మూడీస్ 5.8 శాతానికి పరిమితం చేసింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు వృద్ధి అంచనాను 7.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది.

English summary

భారత్‌కు వరల్డ్ బ్యాంక్ ఝలక్: మన కంటే బంగ్లాదేశ్, నేపాల్ సూపర్ | World Bank Cuts India's Growth Forecast To 6%

The World Bank on Sunday slashed its growth forecast for India's current fiscal year to 6 per cent, down from 7.5 per cent, warning that the "severe" slowdown could further weaken the country's stuttering financial sector.
Story first published: Sunday, October 13, 2019, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X