For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.4,025 కోట్ల భూషణ్ స్టీల్ ఆస్తులు జఫ్తు

|

ఢిల్లీ: బ్యాంకు ఫ్రాడ్ కేసులో భూషణ్ పవర్ అండ్ స్టీల్ (BPSL)కు చెందిన రూ.4,025 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు పీఎంఎల్ఏ నిబంధనల కింద కంపెనీకి ఒడిశాలో ఉన్న ప్లాంటుకు చెందిన భూమి, బిల్డింగ్స్, యంత్ర సామాగ్రిని శనివారం అటాచ్ చేసింది. ఈ కేసులో ఇది తొలి అటాచ్‌మెంట్. మరిన్ని అటాచ్‌మెంట్స్ జరుగుతాయని భావిస్తున్నారు.

పలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను BPSL వివిధ మార్గాల్లో మళ్లించినట్లు ఈడీ తెలిపింది. శనివారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భూమి, బిల్డింగ్, ఒడిశాలోని ప్లాంట్, అందులోని యంత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,025.23 కోట్లు.

మోడీ ప్రభుత్వం నిర్ణయం: రూ.6,250 వరకు పెరగనున్న పెన్షన్మోడీ ప్రభుత్వం నిర్ణయం: రూ.6,250 వరకు పెరగనున్న పెన్షన్

ED attaches Bhushan steels assets worth Rs.4025 crore

మరోవైపు, BPSL కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దాఖలు చేసిన బిడ్‌ను ఆలస్యం కాకుండా ఆమోదించాలని రుణదాతలు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (NCLAT)ను కోరారు. రూ.19,350 కోట్లతో BPSLను కొనుగోలు చేస్తామని జేఎస్‌డబ్ల్యూ ముందుకు వచ్చింది. మరో రూ.350 కోట్లను నిర్వహణ రుణదాతలకు ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌కు గత నెల 5న NCLAT ఓకే చెప్పింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

English summary

రూ.4,025 కోట్ల భూషణ్ స్టీల్ ఆస్తులు జఫ్తు | ED attaches Bhushan steel's assets worth Rs.4025 crore

In a major blow to Bhushan Power and Steel Limited (BPSL), the ED on Saturday attached assets worth ₹4,025 crore, in connection with its ongoing money-laundering probe linked to an alleged bank loan fraud.
Story first published: Sunday, October 13, 2019, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X