For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!: ఏ దేశంలో ఎంతంటే?

|

ఇటీవల పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (PMC) బ్యాంకులో భారీ స్కాం వెలుగు చూసిన అనంతరం వివిధ అంశాలపై చర్చ సాగుతోంది. ఈ బ్యాంకు వర్గాలు నకిలీ ఖాతాలు సృష్టించి అక్రమాలకు తెరలేపినట్లుగా వార్తలు వచ్చాయి. ఆర్బీఐ నివేదికను ఏమార్చాలని కూడా చూశారని తలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే బ్యాంకులో డిపాజిట్ చేసే నగదు ఎంత ఉన్నప్పటికీ మన దేశంలో రూ.1 లక్ష వరకే బీమా వర్తిస్తోంది. బ్యాంకు ఖాతాలో, డాపాజిట్ రూపంలో బ్యాంకులో ఎంత ఉన్న లక్షకే వర్తిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు దివాలా తీసినా, మూసివేసినా అకౌంట్ హోల్డర్‌కు కేవలం రూ.1 లక్ష మాత్రమే వస్తోంది. అయితే ఈ బీమా వర్తింపు గణనీయంగా పెరగాలని ఎస్బీఐ నివేదిక తెలిపింది.

PMC దెబ్బ: బ్యాంకులు హఠాత్తుగా చేతులెత్తేస్తే.. ముందుగా ఇవి తెలుసుకోండి!PMC దెబ్బ: బ్యాంకులు హఠాత్తుగా చేతులెత్తేస్తే.. ముందుగా ఇవి తెలుసుకోండి!

బీమా మొత్తం రెండింతలు..

బీమా మొత్తం రెండింతలు..

డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) ఈ బీమా మొత్తాన్ని ఒక్కో డిపాజిటర్‌కు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు.. అంటే రెండింతలకు పెంచాలని ఎస్బీఐ నివేదిక తెలిపింది. అంతేకాదు, ఈ కవరేజీని రివైజ్ చేయాలని, రెండు కేటగిరీలుగా విభజించాలని కూడా పేర్కొంది.

ఇన్సురెన్స్ కవర్

ఇన్సురెన్స్ కవర్

ఇందులో ఒకటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌కు ఉండాలని, సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలకు కావాల్సిన కవరేజ్ కనీసం రూ.1 లక్ష ఉండాలని, మొత్తం పొదుపు డిపాజిట్లలో 90 శాతం ఉంటాయని నివేదిక తెలిపింది. టర్మ్ డిపాజిట్స్ కవరేజ్ రూ.2 లక్షల వరకు ఉండాలని ఎస్బీఐ నివేదిక తెలిపింది. మొత్తం ఖాతాల్లో ఇవి 70 శాతం ఉంటాయని తెలిపింది. అలాగే, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రొవిజన్ ఉండాలని పేర్కొంది.

ఏ దేశంలో ఎంత కవరేజ్?

ఏ దేశంలో ఎంత కవరేజ్?

డిపాజిట్ ఇన్సురెన్స్ కవర్ విషయంలో వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎంతో తక్కువగా ఉంది. భారత్‌లో 1,508 డాలర్లు లేదా రూ.1 లక్ష ఉంది. ఇతర దేశాలను పరిశీలిస్తే... రష్యా 19,210 డాలర్లు, బ్రెజిల్ 64,025, కెనడా 72,254 డాలర్లు, జపాన్ 88,746 డాలర్లు, ఫ్రాన్స్ 108,870 డాలర్లు, జర్మనీ 108,870 డాలర్లు, ఇటలీ 108, 870 డాలర్లు, యూకే 111,143 డాలర్లు, ఆస్ట్రేలియా 180,143 డాలర్లు, అమెరికా 250,000 డాలర్లుగా ఉంది.

ప్రస్తుతం ఇన్సురెన్స్ ఇలా...

ప్రస్తుతం ఇన్సురెన్స్ ఇలా...

ప్రతి బ్యాంకు డిపాజిటర్‌కు సంబంధించి, అసలు వడ్డీకి రూ.1 లక్ష వరకు బీమాను DICGC అందిస్తోంది. బ్యాంక్ లిక్విడేషన్ లేదా బ్యాంకు లైసెన్స్ రద్దయ్యే తేదీకి లేదా బ్యాంకు విలీనం అయ్యే తేదీ నాటికి ఉన్న మొత్తంపై ఈ బీమా వర్తిస్తుంది. రూ.1 లక్షలోపు ఎంత ఉంటే అంతకు, రూ.1 లక్షకు మించి ఉన్నా రూ.1 లక్షకే బీమా వర్తిస్తుంది. బీమాను పెంచాలనే విజ్ఞప్తులు చాలా కాలంగా ఉన్నాయి.

English summary

డిపాజిట్లపై ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, కవరేజ్ డబుల్!: ఏ దేశంలో ఎంతంటే? | Time to massively increase deposit insurance limit from present Rs 1 lakh

The Deposit Insurance and Credit Guarantee Corporation or DICGC should double the limit for deposit cover from Rs 1 lakh to Rs 2 lakh per depositor, a report by State Bank of India said.
Story first published: Tuesday, October 8, 2019, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X